...
...
Next Story

విద్యార్థుల్లారా.... అడ్మిషన్లకు వేళాయే...! ఈ సర్టిఫికెట్లను ముందుగానే పొందండి

కొత్త విద్యా సంవత్సరం షురూ కానుంది. ఇంటర్ నుంచి పీజీ వరకు అనేక రకాల కోర్సుల్లో ప్రవేశాలు జరుగుతుంటాయి. ఇందుకోసం కొన్ని ధ్రువపత్రాలు తప్పనిసరిగా ఉండాల్సిందే. కొన్ని ముఖ్యమైన వివరాలను ఇక్కడ తెలుసుకోండి….

Published on: May 29, 2025, 16:08:40 IST
By , , Telangana
Prefer HTon Google
Advertisement

కొన్ని రోజుల్లో పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ప్రవేశాల ప్రక్రియ పూర్తి కావాలంటే… ప్రతి విద్యార్థి వద్ద కొన్ని ముఖ్యమైన పత్రాలు ఉండాల్సిందే. ఇందుకోసం విద్యార్థులు, తల్లిదండ్రులు గాబరపడిపోతుంటారు. మండల కేంద్రాలు, మీ-సేవా సెంటర్ల వద్దకు ఉరుకులు పరుగులు పెడుతుంటారు. ముందస్తుగానే వీటి విషయంలో ఓ అవగాహన ఉంటే ఇబ్బందులు లేకుండా ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.

ముఖ్యమైన పత్రాలు….

విద్యా సంస్థల్లో అడ్మిషన్ల ప్రక్రియ - ముఖ్యమైన వివరాలు
విద్యా సంస్థల్లో అడ్మిషన్ల ప్రక్రియ - ముఖ్యమైన వివరాలు

ప్రవేశ ప్రక్రియలో భాగంగా విద్యార్థులుబోనాఫైడ్ సర్టిఫికెట్‌, ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికేట్‌ (TC), కుల ధ్రువీకరణపత్రం, ఆదాయ సర్టిఫికెట్‌, నివాస ధ్రువపత్రం వంటి ముఖ్యమైన డాక్యుమెంట్లు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వ స్కాలర్‌షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లాంటి ప్రయోజనాలు పొందాలంటే ఈ డాక్యుమెంట్లు మరింత కీలకం అవుతాయి.

కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. వీటిని మీసేవా ద్వారా పొందవచ్చు. కుల ధ్రువీకరణ పత్రం కోసం అభ్యర్థి యొక్క ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, తండ్రి/తల్లి యొక్క కుల ధ్రువపత్రం, విద్యా సంస్థ నుంచి బోనాఫైడ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. నిర్ణీత రోజుల్లో ప్రాసెస్ పూర్తి చేసి కుల ధ్రువీకరణ పత్రాన్ని మంజూరు చేస్తారు. మీసేవా ద్వారానే డౌన్లోడ్ చేసుకోవాలి. ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం ఇదే మాదిరిగా ప్రాసెస్ ఉంటుంది. అదనంగా గత ఏడాది ఆదాయ వివరాలు పేర్కొనాలి.

నివాస ధ్రువపత్రం (Residence Certificate) కోసం ఆధార్ కార్డు, ఇంటి అద్దె ఒప్పందం / ఇంటి యజమాని అర్బన్ పాస్‌బుక్ / గృహ పన్ను రశీదు, విద్యార్థుల బోనఫైడ్ సర్టిఫికెట్ సమర్పించాలి. ఇవే కాకుండా ఇతర అవసరమైన పత్రాలను కూడా మీసేవాకేంద్రాల నుంచి పొందవచ్చు. అయితే గ్యాప్ సర్టిఫికెట్ వంటి విషయాల్లో ఇబ్బందులుగానీ ఇతర విషయాల్లో సమస్యలు ఉంటే నేరుగా మండల రెవెన్యూ అధికారులను సంప్రదించవచ్చు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe