2026 టాటా పంచ్ కొంటున్నారా? ఫీచర్లు, వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఆప్షన్లు..
2026 టాటా పంచ్ కొంటున్నారా? అయితే ఇది మీకోసమే! ఈ కారు ఫీచర్లు ఏంటి? ఎవరికి ఏ వేరియంట్ ఆప్షన్ బెటర్? ఏది వాల్యూ ఫర్ మనీ వేరియంట్? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 5.59 లక్షలుగా ఉంది, టాప్ ఎండ్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 10.54 లక్షల వరకు ఉంటుంది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ని కొనసాగిస్తోంది. 88 బీహెచ్పీ పవర్, 115ఎన్ఎం టార్క్‌ను జనరేట్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ ఆప్షన్లలో లభిస్తుంది. 1.2 లీటర్ టర్బో ఇంజిన్‌ను కూడా ఈ పంచ్‌లో ఉంటుంది. ఇది 120 హెచ్‌పీ పవర్, 170 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది.
2026 టాటా పంచ్‌లో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనేది మన వినియోగం బట్టి ఉంటుంది. పెట్రోల్ ఖర్చు తగ్గించుకోవడంతో పాటు ఆటోమేటిక్ డ్రైవింగ్ సౌకర్యం పొందాలనుకునే కస్టమర్లు పంచ్ సీఎన్జీ మోడల్ ఎంచుకోవచ్చు.
మీరు రోజువారీ పనుల కోసం 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో రూ. 8.99 లక్షలకు వస్తుంది. ఒకవేళ నగర ట్రాఫిక్‌లో క్లచ్ నొక్కే బాధ లేకుండా ఉండాలంటే, ఏఎంటీ వెర్షన్‌ను రూ. 9.54 లక్షలకు సొంతం చేసుకోవచ్చు.
మీకు స్పీడ్, పవర్ ఇష్టముంటే, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోసం 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను పిక్ చేసుకోవచ్చు. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. దీని ధర రూ. 9.79 లక్షలు. హైవేలపై లాంగ్ డ్రైవ్ వెళ్లే వారికి ఈ ఇంజిన్ అద్భుతమైన ఎక్స్‌పీరియెన్స్‌ని ఇస్తుంది.
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ స్మార్ట్ వేరియంట్లో 6 ఎయిర్‌బ్యాగులు (స్టాండర్డ్), టీపీఎంఎస్, ఈఎస్సీ, వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. దీనికి డిజిటల్ క్లస్టర్ లభిస్తుంది. ఇక ప్యూర్ వేరియంట్లో రేర్ ఏసీ వెంట్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆల్ పవర్ విండోస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మరోవైపు అడ్వెంచర్ వేరియంట్లో 360-డిగ్రీ కెమెరా, పుష్-బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటర్ వంటి ఫీచర్లు లభిస్తున్నాయి. అకంప్లిష్డ్+ ఎస్ వేరియంట్లో 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్, వాయిస్ అసిస్టెడ్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్వీఎం వంటి ఫీచర్లు ఉంటాయి.
E-Paper

