Weight loss : బరువు తగ్గాలి.. కానీ సమోసా క్రేవింగ్స్​ ఆపుకోలేకపోతున్నారా? ఇలా చేయండి..

సమోసాలు తింటే బరువు పెరుగుతామని చాలా మంది వీటికి దూరంగా ఉంటారు. కానీ, వాటిని తయారు చేసే విధానంలో కొన్ని చిన్న మార్పులు చేయడం ద్వారా సమోసాలను కూడా వెయిట్ లాస్ ఫ్రెండ్లీ స్నాక్‌గా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Published on: Jun 19, 2026 12:23 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

సాయంత్రం వేళ వేడివేడిగా సమోసా తింటుంటే ఆ మజానే వేరు! పైన క్రిస్పీగా, లో!పల నోరూరించే ఆలు మసాలాతో ఉండే సమోసాలను చూస్తే ఎంతటి వారైనా సరే అస్సలు నిగ్రహించుకోలేరు. అయితే, బరువు తగ్గాలనుకునే వారు లేదా హెల్తీ డైట్ పాటించే వారు మాత్రం సమోసాల పేరు చెబితేనే ఆమడదూరం పరిగెడతారు. ఎందుకంటే ఇందులో క్యాలరీలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయని వారి నమ్మకం. కానీ, బరువు తగ్గే క్రమంలో సమోసాలను డైట్ నుంచి పూర్తిగా దూరం పెట్టాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాటిని తయారు చేసే విధానంలో, అందులో వాడే పదార్థాలలో కొన్ని తెలివైన మార్పులు చేయడం ద్వారా తక్కువ క్యాలరీలతో ఎంతో హెల్తీగా మార్చుకోవచ్చు. సమోసాలను బరువు తగ్గడానికి అనుకూలంగా మార్చే 5 అద్భుతమైన చిట్కాలను ఇక్కడ తెలుసుకోండి.
expand-iconView Photos in a new improved layout
Published on Jun 19, 2026 12:23 PM

2/6

ఎయిర్​ ఫ్రైయింగ్- సమోసాలలో క్యాలరీలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం వాటిని నూనెలో ముంచి డీప్ ఫ్రై చేయడమే. దీనికి బదులుగా సమోసాలను ఓవెన్‌లో బేక్ చేయడం లేదా ఎయిర్ ఫ్రైయర్ ఉపయోగించడం వల్ల నూనె వినియోగాన్ని దాదాపు పూర్తిగా తగ్గించవచ్చు. సమోసా పైన మంచి క్రిస్పీ టెక్స్చర్ రావడం కోసం కొద్దిగా నూనెను బ్రష్ లేదా స్ప్రే చేస్తే సరిపోతుంది. ఇది టేస్ట్‌తో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది.

3/6

ప్రోటీన్ స్టఫింగ్- సాధారణంగా సమోసాలలో ఆలుగడ్డను ఎక్కువగా వాడుతుంటారు. ఇది కార్బోహైడ్రేట్లను పెంచి, తిన్న కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేసేలా చేస్తుంది. దీనికి బదులుగా పనీర్, సోయా గ్రన్యూల్స్, శనగలు లేదా పచ్చి బఠానీలు వంటి ప్రోటీన్ ఎక్కువగా ఉండే పదార్థాలను స్టఫింగ్‌గా వాడాలి. ఇది కడుపు నిండిన భావనను కలిగించి, ఎక్కువ సమయం ఆకలి వేయకుండా చూస్తుంది.

4/6

గోధుమ పిండి- సమోసా పైన ఉండే క్రిస్పీ లేయర్‌ను మైదా పిండితో తయారు చేస్తారు. మైదాలో ఫైబర్ అస్సలు ఉండదు, పైగా ఇది త్వరగా అరిగిపోతుంది. దీనికి బదులుగా గోధుమ పిండి లేదా మల్టీగ్రెయిన్ పిండిని వాడటం వల్ల శరీరానికి మంచి ఫైబర్ అందుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా సమోసాకు అదనపు పోషకాలను ఇస్తుంది.

5/6

పరిమాణం- సమోసాలు హెల్తీగా చేశాం కదా అని ఒకేసారి రెండు, మూడు తినేయకూడదు. కేవలం ఒక సమోసాకే పరిమితం అవ్వాలి. దాంతో పాటు తాజా వెజిటబుల్ సలాడ్ లేదా పుదీనా చట్నీ వంటి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని జత చేసుకోవాలి. నిదానంగా, ఆస్వాదిస్తూ తినడం వల్ల తక్కువ క్వాంటిటీతోనే కడుపు నిండుతుంది.

6/6

తీపి చట్నీ వద్దు- సమోసాలతో పాటు ఇచ్చే తీపి చింతపండు చట్నీలో చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో క్యాలరీలను అకస్మాత్తుగా పెంచుతుంది. అందుకే తీపి చట్నీకి బదులుగా పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, నిమ్మరసంతో చేసిన గ్రీన్ చట్నీని ఎంచుకోవాలి. ఇది సమోసాకు అద్భుతమైన రుచిని ఇవ్వడమే కాకుండా వెయిట్ లాస్ గోల్స్‌కు ఎలాంటి అడ్డంకి కాకుండా చూస్తుంది.

Related Photos