TTD Food Analysis Lab : ఇక కల్తీకి చెక్..! తిరుమలలో ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ ప్రారంభం - ప్రత్యేకతలివే
TTD Food Analysis Lab : తిరుమలలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ అందుబాటులోకి వచ్చింది. శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ల్యాబ్ ను ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన విశేషాలను ఇక్కడ తెలుసుకోండి…
తిరుమలలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ అందుబాటులోకి వచ్చింది. శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ల్యాబ్ ను ప్రారంభించారు.
శ్రీవారి భక్తుల నమ్మకానికి భరోసా కల్పిస్తూ, తిరుమల పవిత్ర ప్రసాదాల స్వచ్ఛతను కాపాడేందుకు ఈ అత్యాధునిక ‘స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ’ను ఏర్పాటు చేశారు.
దేశంలోని ఏ పుణ్యక్షేత్రంలోనూ లేని విధంగా ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) తో కుదిరిన ఒప్పందం మేరకు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది.
సుమారు రూ. 25 కోట్ల వ్యయంతో, 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న ఈ పరిశోధనశాల ద్వారా లడ్డూ, అన్న ప్రసాదాల తయారీలో వాడే నెయ్యి, నూనె, పాలు, ఇతర ముడిసరకుల్లో అత్యంత సూక్ష్మ స్థాయిలో కల్తీ జరిగినా వెనువెంటనే గుర్తించే అవకాశం ఉంటుంది.
ఫ్రాన్స్ నుంచి రాబోతున్న 'ఈ-నోస్', 'ఈ-టంగ్' వంటి అత్యాధునిక యంత్రాలు ఆహార పదార్థాల వాసన, రుచిలోని స్వల్ప తేడాలను కూడా పసిగడతాయి. గరిష్టంగా ఒక్కో నమూనాపై 50 రకాల పరీక్షలు చేసేలా ఇక్కడ సౌకర్యాలు కల్పించారు.
కేంద్ర ప్రభుత్వ నిధులు, టీటీడీ సహకారంతో ఏర్పడిన ఈ ల్యాబ్.. ప్రసాదాల నాణ్యత విషయంలో భక్తులకు పూర్తి స్థాయి భరోసా కల్పించనుంది
తిరుమలలోని టీటీడీ వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ భక్తులకు సురక్షితమైన నీరు మరియు ఆహారాన్ని అందించేందుకు వివిధ వనరుల నుంచి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ ల్యాబ్‌లో 6,000 చదరపు అడుగులు రసాయనాల విశ్లేషణకు, మరో 6,000 చదరపు అడుగులు మైక్రో బయాలాజికల్ విశ్లేషణకు కేటాయించారు.
E-Paper

