Recharge plans : 30రోజుల వాలిడిటీతో ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవి- ధర తక్కువ, బెనిఫిట్స్ ఎక్కువ!
Airtel recharge plan : ఎయిర్టెల్ కస్టమర్స్‌కి అలర్ట్! సాధారణంగా రీఛార్జ్ ప్లాన్స్‌లో 28 రోజుల వాలిడిటీ మాత్రమే ఉంటుంది. కానీ 30 రోజుల వాలిడిటీతో ఎయిర్టెల్ కొత్త రీఛార్జ్ ప్లాన్స్‌ని తీసుకొచ్చింది. వాటి వివరాలను ఇక్కడ చూసేయండి..
ఎయిర్టెల్ రూ. 319 ప్లాన్- నెల రోజుల వాలిడిటీతో వస్తున్న ఈ రీఛార్జ్ ప్లాన్‌లో అన్లిమిటెడ్ 5జీ లభిస్తోంది. అదనంగా అన్లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ కూడా పొందవచ్చు. రోజుకు 1.5 డేటాని ఈ ప్యాక్‌తో ఎయిర్టెల్ ఇస్తోంది. రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఫ్రీ. యాపిల్ మ్యూజిక్, 12 నెలల పాటు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియంతో పాటు ఉచిత హెలో ట్యూన్స్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే, గూగుల్ వన్ వంటి వాటికి యాక్సెస్ పొందొచ్చు.
ఎయిర్టెల్ రూ. 429 ప్లాన్- ఈ ప్లాన్ వాలిడిటీ 30 రోజులు. అధిక ఇంటర్నెట్ డేటా కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అన్లిమిటెడ్ 5జీ ఈ ప్యాక్‌తో లభిస్తుంది. అన్లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ పొందొచ్చు. రోజుకు 2.5జీబీ డేటా వాడుకోవచ్చు. ఆ తర్వాత స్పీడ్ తగ్గుతుంది. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ అడోబ్ ప్రీమియం ఎక్స్‌ప్రెస్, ఎయిర్టెల్ స్పామ్ వార్నింగ్ అలర్ట్స్, ఉచిత హలో ట్యూన్స్ వంటి బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్లు మీ సొంతం.
ఎయిర్టెల్ రూ. 589 ప్లాన్- ఈ రీఛార్జ్ ప్యాక్ వాలిడిటీ కూడా నెల రోజులే. మొత్తం 50 జీబీ డేటా లభిస్తోంది. అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఫ్రీ వంటి ఆప్షన్స్ ఉంటాయి. అడోబ్ ప్రీమియం ఎక్స్‌ప్రెస్, ఎయిర్టెల్ స్పామ్ వార్నింగ్ అలర్ట్స్, ఫ్రీ హలోట్యూన్స్ వంటి బెనిఫిట్స్ పొందొచ్చు.
ఎయిర్టెల్ రూ. 609 ప్లాన్- ఈ ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్ రూ. 589 ప్లాన్‌నే పోలి ఉంటుంది. కానీ ఇందులో డేటా కాస్త ఎక్కువగా ఉంటుంది. 60 జీబీ వరకు డేటాను వాడుకోవచ్చు. మిగిలిన బెనిఫిట్స్ అన్నీ ఇందులోనూ లభిస్తాయి.
30 రోజుల వాలిడిటీతో రూ. 48, రూ. 100, రూ. 161, రూ. 195, రూ. 279 రూ. 361 వంటి డేట్ ప్యాక్స్ కూడా ఎయిర్టెల్ తన కస్టమర్లకు ఇస్తోంది.
E-Paper

