Alcohol consumption : 'రెండు పెగ్గులు ఆరోగ్యానికి మంచివే'.. అనుకుంటే పోతారు! కొత్త స్టడీలో షాకింగ్ విషయాలు

Moderate Drinking Myth : రోజూ కొద్దిగా మద్యం తాగడం గుండెకు మంచిదనే పాత నమ్మకాన్ని తాజా పరిశోధనలు కొట్టిపారేశాయి. జర్నల్ ఆఫ్ హెపటాలజీ నివేదిక ప్రకారం.. మద్యం తీసుకోవడంలో 'సురక్షితమైన మోతాదు' అంటూ ఏదీ లేదు. మొదటి చుక్క నుంచే క్యాన్సర్ ముప్పు మొదలవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం కూడా హెచ్చరించింది.

Published on: Jun 4, 2026 11:18 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

దశాబ్దాలుగా ఒక నమ్మకం సమాజంలో బలంగా నాటుకుపోయింది. రోజుకు ఒక గ్లాస్ వైన్ లేదా రెండు పెగ్గుల (తక్కువ మోతాదులో) మద్యం తాగితే గుండెకు మంచిదని, అది ఆరోగ్యానికి మేలు చేస్తుందని చాలామంది భావిస్తారు. అయితే, ఈ నమ్మకం పూర్తిగా తప్పు అని ఆధునిక శాస్త్రీయ ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. మద్యం ఏ మోతాదులో తీసుకున్నా అది శరీరానికి హానికరమేనని 'జర్నల్ ఆఫ్ హెపటాలజీ’లో ప్రచురితమైన ఒక తాజా నివేదిక తేల్చి చెప్పింది. ఎక్కువ తాగితే ప్రమాదం మరింత పెరుగుతుంది, కానీ శరీరానికి ఎలాంటి హాని చేయని ‘సురక్షితమైన మోతాదు’ అంటూ మద్యంలో ఏదీ లేదని పరిశోధకులు స్పష్టం చేశారు.
expand-iconView Photos in a new improved layout
Published on Jun 4, 2026 11:18 AM

2/6

ఈ కొత్త నివేదిక ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు అంతర్జాతీయ ప్రజారోగ్య సంస్థల హెచ్చరికలను మరోసారి బలపరిచింది. మద్యం ఒక ప్రమాదకరమైన క్యాన్సర్ కారకం (కార్సినోజెన్) అని, మనం తాగే మొదటి చుక్క నుంచే ఆరోగ్యానికి ముప్పు మొదలవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలోనే స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా మద్యం వల్ల 30 లక్షల (3 మిలియన్లు) కు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేకాదు, దాదాపు 200 రకాల వ్యాధులు, శారీరక రుగ్మతలకు మద్యం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారణమవుతోంది. కేవలం కాలేయ వ్యాధులు (లివర్ సమస్యలు), వ్యసనానికే పరిమితం కాకుండా.. రకరకాల క్యాన్సర్లు, గుండె జబ్బులు, మానసిక రుగ్మతలకు ఇది దారితీస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

3/6

పరిమితంగా మద్యం తాగే వారి ఆర్థిక స్థితిగతులు, వారు తీసుకునే పౌష్టికాహారం, చేసే శారీరక శ్రమ, మెరుగైన వైద్య సదుపాయాలు వారి ఆరోగ్యానికి కారణమే తప్ప, వారు తాగే మద్యం కాదని పరిశోధకులు గుర్తించారు. ప్రసిద్ధ వైద్య పత్రిక ‘ది లాన్సెట్’ లో ప్రచురితమైన ‘గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్’ విశ్లేషణ ప్రకారం.. అన్ని రకాల ఆరోగ్య నష్టాలను అంచనా వేసినప్పుడు, వారానికి ‘సున్నా’ (అస్సలు తాగకపోవడం) మోతాదు మాత్రమే అత్యంత సురక్షితమైనదని తేలింది.

4/6

మద్యం వల్ల వచ్చే అతిపెద్ద ముప్పు క్యాన్సర్. సిగరెట్లు, అస్బెస్టాస్, రేడియేషన్‌తో సమానంగా మద్యాన్ని కూడా 'గ్రూప్ 1' క్యాన్సర్ కారకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గీకరించింది. రొమ్ము (బ్రెస్ట్ క్యాన్సర్), కాలేయం (లివర్), పేగులు, నోరు, గొంతు మరియు ఆహార వాహిక వంటి కనీసం ఏడు రకాల క్యాన్సర్లకు మద్యం ప్రధాన కారణమని రుజువైంది. ఐరోపా దేశాలలో నమోదవుతున్న మద్యం సంబంధిత క్యాన్సర్ కేసులలో దాదాపు సగం కేసులు చాలా తక్కువ లేదా పరిమితంగా తాగే వారిలోనే కనిపిస్తుండటం గమనార్హం! అమెరికా సర్జన్ జనరల్ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం.. రోజుకు ఒక పెగ్గు లేదా అంతకంటే తక్కువ తాగే మహిళల్లో కూడా రొమ్ము క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది.

5/6

మద్యం శరీరంలోకి వెళ్లినప్పుడు అది ‘అసిటాల్డిహైడ్’ అనే విషపదార్థంగా మారుతుంది. ఇది మన డీఎన్‌ఏని దెబ్బతీయడమే కాకుండా, కణాలు తమను తాము బాగు చేసుకునే ప్రక్రియను అడ్డుకుంటుంది. శరీరం లోపల దీర్ఘకాలిక వాపులు, హార్మోన్ల హెచ్చుతగ్గులకు కారణమవుతుంది. మనం తాగే మద్యాన్ని ఎక్కువగా ప్రాసెస్ చేసేది కాలేయమే కావడంతో, దీని ప్రభావం కాలేయంపై తీవ్రంగా ఉంటుంది. ఎక్కువ కాలం తాగడం వల్ల ఫ్యాటీ లివర్, ఆల్కహాలిక్ హెపటైటిస్, లివర్ సిరోసిస్, కాలేయ క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యలు వస్తాయి.

6/6

గర్భిణీలు, వాహనాలు నడిపేవారు, యంత్రాలపై పనిచేసేవారు, కొన్ని రకాల మందులు వాడుతున్నవారు, ఇప్పటికే కాలేయ వ్యాధులు ఉన్నవారు మద్యాన్ని పూర్తిగా దూరం పెట్టాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అలాగే, యువతలో మద్యం వల్ల జరిగే ప్రమాదాలు, గాయాలు వారి జీవితాలనే ప్రమాదంలో పడేస్తాయని ప్రజారోగ్య సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిపుణులు అందరినీ పూర్తిగా మానేయమని ఒత్తిడి చేయడం లేదు కానీ, వాస్తవాలను తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఒకప్పుడు మద్యానికి ఉన్న ‘హెల్తీ’ ఇమేజ్ ఇప్పుడు మారిపోయింది. దీర్ఘకాలిక ఆరోగ్యం కావాలనుకునే వారు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క సూత్రం.. మద్యానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!

Related Photos