Apple Cider Vinegar : యాపిల్ సైడర్ వెనిగర్ నిజంగా ఆరోగ్యానికి మేలు చేస్తుందా? అసలు నిజాలు..

యాపిల్ సైడర్ వెనిగర్ (ఏసీవీ) ఆరోగ్య ప్రయోజనాలపై సోషల్ మీడియాలో రకరకాల వాదనలు ఉన్నాయి. అయితే రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ, బరువు నిర్వహణలో దీని పాత్ర ఏంటో శాస్త్రీయ అధ్యయనాలు ఏం చెబుతున్నాయి? సురక్షితంగా ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకోండి..

Published on: Aug 18, 2026 12:20 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

ఉదయాన్నే పరగడుపున తాగడమా, భోజనానికి ముందు ఒక స్పూన్ వేసుకోవడమా, లేక సలాడ్‌లో కలుపుకోవడమా? యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడానికి సరైన పద్ధతి ఏదనే దానిపై ఎవరి అభిప్రాయాలు వారివి. అయితే, ఏసీవీ గురించిన ప్రచారమంతా కేవలం భ్రమేమీ కాదు. పరిశోధకులు దీనిపై ఎన్నో అధ్యయనాలు చేసి కొన్ని నిజమైన ప్రయోజనాలను వెలుగులోకి తెచ్చారు. అసలు ఇది శరీరానికి ఏ విధంగా సహాయపడుతుంది, ఎప్పుడు తీసుకోవాలి, ఎంత మోతాదులో వాడితే సురక్షితం అనే విషయాలను ఇక్కడ చూద్దాం.
expand-iconView Photos in a new improved layout
Published on Aug 18, 2026 12:20 PM

2/6

కిణ్వ ప్రక్రియ (fermentation) సమయంలో తయారయ్యే ఎస్టిక్ ఆమ్లం యాపిల్ సైడర్ వెనిగర్‌లో ఉంటుంది. పరిశోధనలు జరుగుతున్న చాలా అంశాలకు ఈ సమ్మేళనమే ప్రధాన కారణం. “రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణపై పరిశోధనలు స్పష్టమైన ఫలితాలను అందించాయి. భోజనంతో పాటు వెనిగర్ తీసుకుంటే తిన్న తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగడాన్ని తగ్గించవచ్చు,” అని ప్రముఖ పోషకాహార పరిశోధకులు కరోల్ జాన్‌స్టన్ తమ సహచరులతో కలిసి నిర్వహించిన రాండమైజ్డ్ క్రాస్‌ఓవర్ అధ్యయనంలో తేల్చేశారు. భోజనానికి కొన్ని గంటల ముందు కంటే, భోజనం చేసే సమయంలోనే వెనిగర్ తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు కనిపించాయని చెబుతున్నారు.

3/6

బరువు తగ్గడంలో పాత్ర- ఈ అంశంపై కూడా కొన్ని పరిశోధనలు జరిగాయి కానీ, వాస్తవాలను దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. జపాన్ పరిశోధకులు టోమో కోండో నేతృత్వంలో 2009లో ఊబకాయంతో బాధపడుతున్న 175 మందిపై 12 వారాల పాటు ఒక అధ్యయనం జరిగింది. ప్రతిరోజూ వెనిగర్ సేవించిన వారు, తీసుకోని వారితో పోలిస్తే తమ శరీర బరువు, బీఎంఐ, శరీర కొవ్వు శాతంలో స్వల్ప తగ్గుదలని చూశారు. అంతమాత్రాన ఏసీవీ కొవ్వును ఇట్టే కరిగించేస్తుందని లేదా పొట్ట దగ్గరి కొవ్వును మాయం చేస్తుందని కాదు. తగిన ఆహారపు అలవాట్లతో పాటు దీన్ని తీసుకుంటే బరువు నిర్వహణలో వెనిగర్ చిన్నపాటి సహాయం చేయగలదని ఇది సూచిస్తుంది.

4/6

జీర్ణక్రియపై ప్రభావం- ఇంటర్నెట్‌లో ఏసీవీ గురించి అత్యంత ఎక్కువగా చర్చించుకునే అంశం ఇదే. అయితే ఇక్కడే అందరూ కాస్త ఆచి తూచి వ్యవహరించాలి. వెనిగర్ జీర్ణకోశ మైక్రోబయోమ్‌ను ప్రభావితం చేస్తుందని ప్రాథమిక పరిశోధనలు చెబుతున్నాయి. వెనిగర్ తీసుకున్న తర్వాత జంతువులపై చేసిన అధ్యయనాల్లో పేగుల్లోని బ్యాక్టీరియా రకాలలో, పరిమాణంలో మార్పులు గమనించారు. అయితే, మానవులపై ఇప్పటికీ పరిమిత స్థాయిలోనే పరిశోధనలు జరిగాయి. కాబట్టి, ఏసీవీ మీ పేగులను బాగు చేస్తుందని లేదా మైక్రోబయోమ్‌ను పూర్తిగా నయం చేస్తుందని ఇప్పుడే కచ్చితంగా చెప్పలేం.

5/6

ఎప్పుడు తీసుకోవాలి? ఎంత తీసుకోవాలి?- రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవడమే మీ లక్ష్యమైతే, భోజనంతో పాటు లేదా భోజనానికి కాస్త ముందు (ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారంతో) వెనిగర్ తీసుకోవడం మంచిదని పరిశోధనలు సూచిస్తున్నాయి. కేవలం మీ డైట్‌లో ఏసీవీ భాగం చేసుకోవాలని మాత్రమే అనుకుంటే, దీనికి కచ్చితమైన సమయం అంటూ ఏదీ లేదు. ఒక పెద్ద గ్లాసు నీటిలో 1 టీస్పూన్ ఏసీవీ కలుపుకుని తాగడంతో ప్రారంభించడం సులువైన మార్గం. కొన్ని అధ్యయనాలలో ఎక్కువ మోతాదులను కూడా వాడారు, కానీ పరిశోధనల్లో వాడిన అత్యధిక మోతాదులనే మీరు కూడా అనుసరించాలని నియమం లేదు. వెనిగర్ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు కూడా అంతకంటే ఎక్కువగా వస్తాయని అనుకోవడం పొరబాటే.

6/6

ACV లో ఆమ్ల గుణం ఉంటుంది. దీన్ని నీళ్లలో కలువకుండా నేరుగా తాగితే గొంతు మంట పుట్టడంతో పాటు కాలక్రమేణా దంతాల ఎనామిల్ దెబ్బతింటుంది. ఆమ్ల పానీయాలు దంతాలకు తక్కువగా తగిలేలా చూసుకోవాలని, నోట్లో వేసుకొని పుక్కిలించకూడదని, ఆ తర్వాత మంచి నీళ్లతో నోరు కడుక్కోవాలని అమెరికన్ డెంటల్ అసోసియేషన్సిఫార్సు చేస్తోంది. కాబట్టి ఏసీవీని నేరుగా "షాట్" లాగా తాగడానికి బదులుగా, తగినన్ని నీళ్లలో సరిగ్గా డైల్యూట్ చేసి తీసుకోండి. అంతకంటే మంచిది, దీన్ని సలాడ్ డ్రెస్సింగ్‌లో కలుపుకోవడం, మారినేడ్ తయారీలో వాడడం లేదా ఇతర వంటకాల్లో ఉపయోగించడం ఉత్తమం.

Related Photos