Oppo K14 5G : 7000ఎంఏహెచ్ బ్యాటరీతో ఒప్పో కే14- 50ఎంపీ కెమెరా కూడా! ధర ఎంతంటే..
Oppo K14 5G price : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో, తన కే14 సిరీస్‌లో భాగంగా కొత్త ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. భారీ బ్యాటరీ, ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లు, అదిరిపోయే ఏఐ ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ ధర, సేల్ వివరాలు ఇక్కడ ఉన్నాయి..
బడ్జెట్ ధరలో శక్తివంతమైన ఫీచర్లను కోరుకునే భారతీయుల కోసం ఒప్పో సంస్థ ఒప్పో కే14 5జీ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది.ముఖ్యంగా ఎక్కువ కాలం బ్యాటరీ లైఫ్ కావాలనుకునే వారికి ఈ ఫోన్ ఒక వరంలా మారనుంది. ఇందులో ఏకంగా 7,000ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని అమర్చడం విశేషం
ఒప్పో కే14 5జీ ధరలు- GB + 128GB: దీని ధర రూ. 17,999, 6GB + 256GB: దీని ధర రూ. 19,999, 8GB + 256GB (టాప్ ఎండ్): దీని ధర రూ. 21,999.
బ్యాంక్ ఆఫర్లు: హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వారికి రూ. 1,000 వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఈ ఒప్పో కే14 ఫోన్ మార్చ్ 20 నుంచి ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఆన్‌లైన్ స్టోర్లలో అమ్మకానికి రానుంది. ఐసీ బ్లూ, ప్రిజం వైలెట్, ప్రిజం వైట్ రంగుల్లో ఇది అందుబాటులో ఉంటుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 6.75 ఇంచ్ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్. 1,125 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ వాడారు. ఇది మునుపటి కంటే 15 శాతం మెరుగైన పెర్ఫార్మెన్స్‌ను ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ ఓఎస్ 15పై ఇది పనిచేస్తుంది. వెనుక వైపు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా (ఏఐ సపోర్ట్‌తో), 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఏఐ ఎరేజర్ 2.0, ఏఐ క్లారిటీ ఎన్‌హాన్సర్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7,000mAh భారీ బ్యాటరీకి తోడు 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 19 గంటల పాటు యూట్యూబ్ వీడియోలు చూడవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్‌కు IP66, IP68, IP69 రేటింగ్స్ ఉన్నాయి. అంటే నీరు, ధూళి నుంచి దీనికి గట్టి రక్షణ లభిస్తుంది.
E-Paper

