Pumpkin Seeds : గుమ్మడి గింజలతో బోలెడు లాభాలు- సంపూర్ణ ఆరోగ్యం.. మీ సొంతం!

గుమ్మడి గింజలు కేవలం స్నాక్స్ మాత్రమే కాదు.. శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్, ఖనిజ లవణాలను అందించే అద్భుతమైన సూపర్ ఫుడ్. వీటిని రోజూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవ్వడమే కాకుండా నిద్రలేమి సమస్య కూడా దూరం అవుతుంది. ఇంకా ఎన్నో ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అవి…

Published on: Jun 29, 2026 11:28 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తర్వాత చాలామంది తమ డైట్‌లో విత్తనాలను (సీడ్స్) భాగం చేసుకుంటున్నారు. వీటిలో తక్కువ ధరకే లభిస్తూ, పోషకాల గనిగా పేరుగాంచినవి గుమ్మడి గింజలు ప్రముఖంగా ఉంటాయి. వీటిని 'పెపిటాస్' అని కూడా పిలుస్తారు. ఇందులో ఉండే ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్, ఫైబర్‌తో పాటు మెగ్నీషియం, జింక్ వంటి అవసరమైన ఖనిజాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి అద్భుతంగా సహాయపడతాయి. రోజూ కొద్ది మొత్తంలో ఈ గింజలను ఆహారంగా తీసుకోవడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాము..
expand-iconView Photos in a new improved layout
Published on Jun 29, 2026 11:28 AM

2/6

గుండె ఆరోగ్యం భద్రం- గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, పొటాషియం, ఆరోగ్యకరమైన ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది.

3/6

ప్రశాంతమైన నిద్ర మీ సొంతం- రాత్రిళ్లు నిద్రలేమితో బాధపడేవారికి గుమ్మడి గింజలు ఒక వరప్రసాదం. వీటిలో సహజంగానే 'ట్రిప్టోఫాన్' అనే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలోకి వెళ్లాక సెరటోనిన్, మెలటోనిన్‌లుగా మారుతుంది. ఈ హార్మోన్లు నిద్ర-మెలకువ చక్రాలను క్రమబద్ధీకరించి, ప్రశాంతమైన నిద్ర పట్టేలా చేస్తాయి.

4/6

రోగనిరోధక శక్తి పెరగడం, బరువు నియంత్రణ- ఇందులో ఉండే జింక్, విటమిన్ ఈ శరీర కణాలను ఇన్ఫ్లమేషన్ (వాపులు) నుంచి కాపాడుతాయి. హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లపై పోరాడి బాడీ ఇమ్యూనిటీని స్ట్రాంగ్‌గా మారుస్తాయి. గుమ్మడి గింజల్లో ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల వీటిని తిన్నప్పుడు కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది అతిగా తినడాన్ని తగ్గించి, బరువు అదుపులో ఉండేలా చేస్తుంది. అలాగే, ఇందులోని మెగ్నీషియం రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడంలో తోడ్పడుతుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారికి ఇది మంచి స్నాక్ ఆప్షన్!

5/6

ప్రోస్టేట్, బ్లాడర్ సమస్యలకు చెక్- వయసు పైబడిన పురుషులలో వచ్చే ప్రోస్టేట్ వాపు లేదా ఓవర్‌యాక్టివ్ బ్లాడర్ వంటి మూత్రకోశ సంబంధిత సమస్యలను తగ్గించడంలో గుమ్మడి గింజల సారం అద్భుతంగా పనిచేస్తుందని పలు అధ్యయనాలు నిరూపించాయి.

6/6

50 గ్రాముల గుమ్మడి గింజల్లో ఉండే పోషకాలు- క్యాలరీలు: ~227, ప్రోటీన్: 15 గ్రాములు, ఫ్యాట్స్: 20 గ్రాములు (ఆరోగ్యకరమైన పాలీఅన్‌శాచురేటెడ్, సమోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్), కార్బోహైడ్రేట్లు: 9.3 గ్రాములు, ఫైబర్: 2.5 గ్రాములు.

Related Photos