Amazon sale : క్రేజీ డీల్.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ. 39వేలకే ఐఫోన్ 16!
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026 సందర్భంగా యాపిల్ ఐఫోన్ 16 పై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లతో కలిపి కేవలం రూ. 38,999లకే కొత్త ఐఫోన్ సొంతం చేసుకునే అరుదైన అవకాశం అందుబాటులోకి వచ్చింది! పూర్తి వివరాలు..

గ్లోబల్ మార్కెట్లో మెమరీ చిప్‌ల కొరత, విడిభాగాల ధరలు పెరగడంతో స్మార్ట్ఫోన్ల తయారీ వ్యయం గణనీయంగా పెరిగింది. ఇది భారతీయ వినియోగదారులకు ప్రీమియం ఫోన్లను, ముఖ్యంగా యాపిల్ ఐఫోన్‌ను అందుబాటులో లేకుండా చేసింది. అయితే, దసరా, దీపావళి పండుగల సీజన్ వేళ పాత ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకునే వారికి ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అదిరిపోయే వార్త అందించింది. ప్రస్తుతం నడుస్తున్న ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026’లో యాపిల్ ఐఫోన్ 16పై మునుపెన్నడూ లేని రీతిలో భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.

సెప్టెంబర్ 2024లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన ఐఫోన్ 16 (128GB బేస్ వేరియంట్) ప్రారంభ ధర రూ. 79,900గా ఉండేది. ఇటీవల తయారీ వ్యయాలు పెరగడంతో యాపిల్ సంస్థ ఈ మోడల్ ధరను రూ. 89,900కి పెంచింది. అయితే ఈ పండుగ సేల్‌లో అమెజాన్ దీని ప్లాట్ ప్రైస్‌ను నేరుగా రూ. 76,999కి తగ్గించింది.

ఇక ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ. 1,000 వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. అలాగే అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు చెల్లింపులపై రూ. 2,309 వరకు క్యాష్‌బ్యాక్ ఇస్తున్నారు. నెలకు రూ. 2,161 ప్రారంభ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ల ద్వారా వడ్డీ భారం లేకుండా సులువుగా కొనుగోలు చేయవచ్చు. మీ వద్ద ఉన్న పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ. 37,600 వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు, ఎక్స్ఛేంజ్ బోనస్ మొత్తాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటే, ఐఫోన్ 16 బేస్ మోడల్‌ను కేవలం రూ. 38,999లకే సొంతం చేసుకోవచ్చని కంపెనీ ప్రతినిధులు తెలిపారు!

ఈ ఐఫోన్ 16 6.1-ఇంచుల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్ప్లేతో వస్తోంది. ఇది 2,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉండి, ఎండలోనూ స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా చేస్తుంది. డిస్ప్లే పైభాగంలో ‘డైనమిక్ ఐలాండ్’ నాచ్ ఉంది. నీరు, ధూళి నుంచి రక్షణ కోసం ఐపీ68 (IP68) రేటింగ్‌ను పొందింది.యాపిల్ శక్తివంతమైన 'ఏ18' చిప్‌సెట్‌పై ఈ ఐఫోన్ 16 పనిచేస్తుంది. ఇది గేమింగ్, గ్రాఫిక్స్, మల్టీ టాస్కింగ్‌ను వేగవంతం చేస్తుంది.

ఐఫోన్ 16 వెనుక వైపు 48 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్లతో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 12 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఒకే ఛార్జ్‌పై ఏకంగా 22 గంటల వీడియో ప్లేబ్యాక్ టైమ్ ఇస్తుంది. మెరుగైన ఛార్జింగ్ కోసం 25డబ్ల్యూ మాగ్‌సేఫ్ వైర్లెస్ ఛార్జింగ్, క్యూఐ2 వైర్లెస్ ఛార్జింగ్ సాంకేతికతలకు సపోర్ట్ చేస్తుంది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవాలనుకునే సగటు వినియోగదారునికి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026 గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్, బ్యాంక్ ఆఫర్లను సరైన రీతిలో వాడుకుంటే రూ. 40,000 లోపే ఐఫోన్ 16 మోడల్ చేజిక్కించుకోవచ్చు!

E-Paper

