Heatwave : భయపెట్టే ఉష్ణోగ్రతల్లో బైక్​ ప్రయాణమా? ఈ జాగ్రత్తలు తీసుకోండి..

AP Heatwave : ఆంధ్రప్రదేశ్​, తెలంగాణతో పాటు యావత్​ భారత దేశాన్ని హీట్​వేవ్​ పరిస్థితులు వణికిస్తున్నాయి. ఈ భయంకరమైన ఎండల వల్ల రోడ్లపై ప్రయాణించే టూ-వీలర్ రైడర్లు, డెలివరీ బాయ్స్, గిగ్ వర్కర్లు తీవ్ర అనారోగ్యాల బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..

Published on: May 24, 2026 11:18 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

జీర్ణవ్యవస్థపై ఎండల ప్రభావం- శీతాకాలంతో పోలిస్తే వేసవిలో ఆహారం, నీటిలో బ్యాక్టీరియా (క్రిములు) చాలా వేగంగా వృద్ధి చెందుతాయి. దీనివల్ల ఆహారం త్వరగా చెడిపోతుంది. ఫలితంగా మోషన్స్), జ్వరం, కడుపునొప్పి, వాంతులు, కొన్నిసార్లు మలంలో రక్తం పడటం వంటి సమస్యలు ఈ కాలంలో బైక్ రైడర్లలో ఎక్కువగా కనిపిస్తాయి. రైడింగ్‌కు వెళ్లే ముందు ఎక్కువ నూనె, మసాలాలు ఉన్న భారీ ఆహారాన్ని అస్సలు తీసుకోకూడదు. తక్కువ కారంతో కూడిన తేలికపాటి భోజనం, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలి.
expand-iconView Photos in a new improved layout
Published on May 24, 2026 11:18 AM

2/5

డిహైడ్రేషన్ లక్షణాలను గుర్తించండి- చాలామంది రైడర్లు తమ శరీరంలో ఎంత వేగంగా నీటి శాతం పడిపోతుందో గమనించలేరు. పొడి నోరు, విపరీతమైన దాహం, అలసట, ముదురు రంగులో మూత్రం రావడం, తలనొప్పి, కండరాల నొప్పులు అనేవి డిహైడ్రేషన్‌కు ప్రాథమిక సంకేతాలు. వీటిని నిర్లక్ష్యం చేస్తే బైక్ నడిపేటప్పుడు ఏకాగ్రత దెబ్బతిని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందుకే దాహం వేసే వరకు ఆగకుండా నిరంతరం నీరు తాగుతూ ఉండాలి. లాంగ్ రైడ్స్ చేసేవారు తమతో పాటు ఓఆర్ఎస్ పౌడర్ లేదా నిమ్మరసం, మజ్జిగ ఉంచుకోవడం మంచిది. అతిగా టీ, కాఫీ, శీతల పానీయాలు తాగడం వల్ల డిహైడ్రేషన్ మరింత పెరుగుతుంది.

3/5

మధ్యాహ్నం వేళ ప్రయాణాలు వద్దు- మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఎండ తీవ్రత అత్యధికంగా ఉంటుంది. ఈ సమయంలో రోడ్లు కూడా వేడిని విరజిమ్ముతాయి. అత్యవసరమైతే తప్ప ఈ సమయాల్లో లాంగ్ రైడ్స్ చేయకండి. ఒకవేళ ప్రయాణించాల్సి వస్తే, మధ్యమధ్యలో చెట్ల నీడలో బైక్ ఆపి విశ్రాంతి తీసుకోవాలి.

4/5

చర్మ రక్షణ- ఎండ తగలకుండా ఉండటానికి, బైక్ సేఫ్టీ కోసం వేసుకునే కొన్ని రైడింగ్ జాకెట్లు లోపల వేడిని పట్టి ఉంచి, విపరీతంగా చెమటలు పట్టేలా చేస్తాయి. బైక్ నడిపేటప్పుడు కాటన్ (నూలు) దుస్తులను లోపలి లేయర్‌గా వేసుకోవాలి. తేలికపాటి రంగులు ఉన్న ఫుల్ స్లీవ్ షర్టులు, గాలి ఆడేలా వెంటిలేషన్ ఉన్న హెల్మెట్లు, సన్‌గ్లాసెస్ (నల్లటి అద్దాలు) వాడటం వల్ల యూవీ కిరణాల నుంచి రక్షణ లభిస్తుంది.

5/5

వడదెబ్బ ముప్పు- పరీతమైన వేడి, కళ్లు తిరగడం,ఆందోళన, వాంతులు కావడం వంటివి జరిగినా.. లేదా అంతటి ఎండలో కూడా హఠాత్తుగా చెమటలు పట్టడం ఆగిపోయినా.. అది ప్రమాదకరమైన 'హీట్ స్ట్రోక్' కావచ్చు. అలాంటి సమయంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే అత్యవసర వైద్య సహాయం అందించాలి.

Related Photos