Tata cars : ఇక ‘కీ’ అవసరం లేదు.. ఐఫోన్​తోనే మీరు మీ టాటా కార్లను స్టార్ట్​ చేయొచ్చు!

Apple Car Key Tata EV, : భారతదేశ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, టెక్ జెయింట్ యాపిల్​తో చేతులు కలిపినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. త్వరలోనే టాటా ఎలక్ట్రిక్ వాహనాల యూజర్లు తమ ఐఫోన్ లేదా యాపిల్ వాచ్‌తోనే కారును లాక్, అన్‌లాక్ చేయడమే కాకుండా స్టార్ట్ కూడా చేయవచ్చు. వివరాల్లోకి వెళితే..

Published on: Apr 21, 2026 10:43 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

టెక్నాలజీ పరంగా టాటా ఈవీలు మరో మెట్టు ఎక్కబోతున్నాయి. యాపిల్ తన ప్రసిద్ధ ‘కార్ కీ’ ఫీచర్‌ను టాటా ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు 'MacRumors' నివేదిక పేర్కొంది. యాపిల్ ఇంటర్నల్ బ్యాకెండ్ డేటా ప్రకారం.. ఈ ఫీచర్ సపోర్ట్ చేసే వాహనాల జాబితాలో టాటా ఈవీ పేరు చేరింది. ఐఫోన్ వారసత్వంగా వస్తున్న వినూత్న ఫీచర్లు ఇప్పుడు భారతీయుల ఫేవరెట్ టాటా కార్లలోకి రావడం విశేషం.
expand-iconView Photos in a new improved layout
Published on Apr 21, 2026 10:43 AM

2/5

యాపిల్ వాలెట్ యాప్‌లో ఉండే ఈ 'డిజిటల్ కార్ కీ' ద్వారా ఫిజికల్ కీ అవసరం లేకుండానే కారును నియంత్రించవచ్చు. కారు డోర్ హ్యాండిల్ దగ్గర ఐఫోన్ లేదా యాపిల్ వాచ్‌ను ఉంచితే చాలు, ఎన్‌ఎఫ్‌సీ టెక్నాలజీ ద్వారా కారు అన్‌లాక్ అవుతుంది. సరికొత్త ఆల్ట్రా-వైడ్ బ్యాండ్ టెక్నాలజీ ఉన్న కార్లలో అయితే, మీరు కారు దగ్గరికి వెళ్లగానే ఆటోమేటిక్‌గా అన్‌లాక్ అవుతుంది. మీరు కారులో కూర్చున్న వెంటనే ఫోన్ జేబులో ఉన్నా కూడా కారు స్టార్ట్ అవుతుంది.

3/5

ఫేస్ ఐడీ లేదా పాస్‌కోడ్ అవసరం లేకుండానే వేగంగా కారును అన్‌లాక్ చేసేందుకు యాపిల్ 'ఎక్స్‌ప్రెస్ మోడ్' సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది.

4/5

ఈ ఫీచర్‌లో మరో అద్భుతమైన సౌకర్యం ఉంది. మీ కారు కీని మీరు మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు ఎయిర్​డ్రాప్ లేదా మెసేజింగ్ యాప్స్ ద్వారా షేర్ చేయవచ్చు! మీరు ఇంట్లో లేకపోయినా, వేరే ఊరిలో ఉన్నా కూడా మీ కారును మీ సన్నిహితులు వాడేలా డిజిటల్ పర్మిషన్లు ఇవ్వవచ్చు.

5/5

ఈ ఫీచర్ వాడాలంటే మీ వద్ద ఐఫోన్ 11 లేదా ఆపై మోడల్స్ ఉండాలి. యాపిల్ వాచ్ అయితే సిరీస్ 6 లేదా ఆ తర్వాత వచ్చిన మోడల్స్ అవసరం. టాటా ఈవీకి సంబంధించి ఏయే నిర్దిష్ట మోడల్స్ (Nexon.ev, Punch.ev లేదా Curvv.ev) లో ఈ సదుపాయం ఉంటుందో కంపెనీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

గమనించదగ్గ విషయం ఏంటంటే, ఇప్పటికే బీఎండబ్ల్యూ, మెర్సిడెస్, హ్యుందాయ్ వంటి గ్లోబల్ బ్రాండ్లు ఈ ఫీచర్‌ను వాడుతున్నాయి.

Related Photos