మంగళవారం అతి తీవ్ర తుపానుగా అర్నబ్‌.. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు

Cyclone Arnab : బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్‌ తుపాను తీరం దిశగా ఏపీ వైపు దూసుకొస్తోంది. మంగళవారం నాటికి అతి తీవ్ర తుపానుగా మారనుంది.

Published on: Oct 26, 2026 6:17 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

బంగాళాఖాతంలో అర్నబ్‌ తుపాను అత్యంత వేగంగా ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం వైపు దూసుకొస్తోంది. వాతావరణ శాఖ అందించిన తాజా సమాచారం ప్రకారం, ఇది సోమవారం అర్ధరాత్రికి తీవ్ర తుపానుగా, మంగళవారం నాటికి అతి తీవ్ర తుపానుగా మారనుంది. అనంతరం బుధవారం ఉదయానికి బాపట్ల - విశాఖపట్నం మధ్య ఉన్న యానాం సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
expand-iconView Photos in a new improved layout
Published on Oct 26, 2026 6:17 PM

2/5

తుపాను తీరం దాటే పీక్ సమయంలో ఏపీ తీరప్రాంతాల్లో గంటకు 120 నుండి 140 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొన్నారు. మంగళవారం నాటికే కోస్తా తీరం వెంబడి 90 నుంచి 100 కి.మీ వేగంతో గాలుల తీవ్రత ఉండనుంది.

3/5

భారీ నుండి అతిభారీ వర్ష సూచన ఉన్న జిల్లాలు : శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలకు అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.

4/5

అత్యంత భారీ వర్షాలు పడే జిల్లాలు : కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు

5/5

తుపాను ధాటికి చెట్లు కూలిపోవడం, విద్యుత్ స్తంభాలు నేలకొరగడం, పాత భవనాలు దెబ్బతినే ముప్పు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. శిథిలావస్థలో ఉన్న భవనాల్లో నివసిస్తున్న వారు తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని సూచించింది. ఏదైనా ప్రమాదం లేదా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ప్రజలు సహాయం కోసం రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించవచ్చు: 112 (అత్యవసర రక్షణ నంబర్), 1070, 18004250101. కోస్తాంధ్ర ప్రజలు వాతావరణ శాఖ ఇచ్చే అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని, అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Related Photos