బాలీవుడ్​ డింపుల్​ బ్యూటీతో రిలేషన్! ఎట్టకేలకు మౌనం విప్పిన స్టార్ బౌలర్..

Brett Lee Preity Zinta relation : బాలీవుడ్ నటి ప్రీతి జింటాతో ప్రేమాయణంపై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం బ్రెట్ లీ క్లారిటీ ఇచ్చాడు. తమది కేవలం స్నేహం మాత్రమే అని తేల్చిచెప్పాడు. ఈ రూమర్స్​ని ప్రీతి జింటా ఎప్పుడో కొట్టేసింది.

Published on: Aug 5, 2026 4:01 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన, అత్యంత ప్రభావవంతమైన ఫాస్ట్ బౌలర్లలో ఒకరైన ఆస్ట్రేలియా దిగ్గజం బ్రెట్ లీ.. గడిచిన కొన్నేళ్లుగా సోషల్​ మీడియాలో తిరుగుతున్న రూమర్స్​పై ఎట్టకేలకు నోరు విప్పాడు. బాలీవుడ్ డింపుల్ బ్యూటీ, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) ఐపీఎల్ ఫ్రాంచైజీ సహ యజమాని ప్రీతి జింటాతో తనకు గతంలో ప్రేమాయణం నడిచిందనే కథనాలకు ఆయన ముగింపు పలికాడు.
expand-iconView Photos in a new improved layout
Published on Aug 5, 2026 4:01 PM

2/5

2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమైన సమయం నుంచి పంజాబ్ జట్టుకు ఆడిన బ్రెట్ లీ, 2010 వరకు ఆ టీమ్‌లోనే కొనసాగాడు. ఆ తర్వాత 2011లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులోకి వెళ్లారు. అయితే పంజాబ్ జట్టు తరఫున ఆడుతున్న రోజుల్లో.. మ్యాచ్ వేదికల్లోనూ, వెలుపల ప్రీతి జింటా, బ్రెట్ లీ కలసి కనిపించడంతో వారిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. దాదాపు దశాబ్దానికి పైగా సాగిన ఈ కథనాలపై అప్పట్లో బ్రెట్ లీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఇటీవల ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ అంశంపై బ్రెట్ లీ స్పందిస్తూ, తమ ఇద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని స్పష్టం చేశాడు.

3/5

“ఇదిగోండి మీకు అసలైన నిజం చెబుతున్నాను.. నేను నా జీవితంలో ఏ బాలీవుడ్ నటితోనూ డేటింగ్ చేయలేదు. ప్రీతి జింటా, నేను గతంలో మంచి స్నేహితులము, ఇప్పటికీ అలాగే ఉన్నాం. ఆవిడ పంజాబ్ జట్టు బాస్. చాలా తెలివైన మహిళ. ఆమెపై నాకు అమితమైన గౌరవం ఉంది. ఇలాంటి పుకార్లు నన్ను ఎప్పుడూ కలవరపెట్టలేదు, ఎందుకంటే నాకూ, ఆమెకూ అసలు నిజమేంటో స్పష్టంగా తెలుసు. జనాలు రకరకాలుగా ఊహించుకోవచ్చు, కానీ అలాంటి విషయాలు నా మనస్సుపై ప్రభావం చూపడానికి నేను ఎప్పుడూ అనుమతించను,” అని బ్రెట్​ లీ తేల్చిచెప్పేశాడు.

4/5

బ్రెట్ లీ ఇంత కాలం పాటు మౌనంగా ఉన్నప్పటికీ, 2010లోనే ప్రీతి జింటా ఈ వార్తలను ఖండించింది. ప్రతి సంవత్సరం బ్రెట్ లీతో తనని ముడిపెడుతూ వార్తలు రాయడం ఇప్పుడు పాతబడిపోయిన కథ అని, తమ ఇద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని ఆమె అప్పట్లోనే సామాజిక మాధ్యమాల ద్వారా స్పష్టం చేశారు. వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే, బ్రెట్ లీ 2006లో ఎలిజబెత్ కెంప్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. అయితే మనస్పర్థల కారణంగా మూడేళ్లకే వీరి దాంపత్య బంధం ముగిసింది. 2009లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2014లో బ్రెట్ లీ లానా అండర్సన్‌ను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

5/5

ఇక ప్రీతి జింటా విషయానికి వస్తే, గత కొన్నేళ్లుగా వెండితెరకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆమె మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. సన్నీ డియోల్ కథానాయకుడిగా నటిస్తున్న 'బట్వారా 1947' చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక క్రీడల పరంగా చూస్తే, ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ కో-ఓనర్‌గా ఇప్పటికీ కొనసాగుతున్న ఆమె.. తమ జట్టు సొంత మైదానంలో జరిగే మ్యాచ్‌లకు విధిగా హాజరవుతూ స్టాండ్స్‌లో సందడి చేస్తూనే ఉంటుంది.

Related Photos