Baal Aadhaar : పిల్లల కోసం ‘బాల ఆధార్’! ఎలా అప్లై చేయాలి? తల్లిదండ్రులు ఇవి తెలుసుకోవాలి..

ఐదేళ్లలోపు పిల్లల కోసం విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ప్రత్యేక 'బాల్ ఆధార్' కార్డులను జారీ చేస్తోంది. బయోమెట్రిక్ అవసరం లేని ఈ కార్డు దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలు, తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ల సమగ్ర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 12, 2026 11:18 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఐదేళ్లలోపు చిన్నారుల కోసం ప్రత్యేకంగా నీలిరంగులో 'బాల్ ఆధార్' (Baal Aadhaar) కార్డులను అందజేస్తోంది. పాఠశాల ప్రవేశాలు, పాస్‌పోర్ట్ దరఖాస్తులు, ఆసుపత్రి రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందడానికి ఈ 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య అత్యంత కీలక ఆధారంగా మారింది. ఐదేళ్లలోపు పిల్లల వేలిముద్రలు, ఐరిస్ (కంటిపాప) పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల ఈ కార్డు జారీ సమయంలో చిన్నారి బయోమెట్రిక్ వివరాలను సేకరించరు.
expand-iconView Photos in a new improved layout
Published on Oct 12, 2026 11:18 AM

2/5

బయోమెట్రిక్ డేటా లేని కారణంగా, చిన్నారి ఆధార్ కార్డును తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకులలో ఒకరి ఆధార్ సంఖ్యతో అనుసంధానిస్తారు. ఐదేళ్ల వయస్సు ఉన్నంత వరకు ఈ నీలిరంగు ఆధార్ చెల్లుబాటు అవుతుంది. చిన్నారికి 5 ఏళ్లు నిండిన తర్వాత మొదటిసారి ఉచితంగా 'తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్' పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ 15 ఏళ్ల వయస్సు వచ్చినప్పుడు రెండోసారి బయోమెట్రిక్ వివరాలను నవీకరించాల్సి ఉంటుంది.

3/5

'బాల్ ఆధార్' దరఖాస్తు విధానం- బాల్ ఆధార్ కోసం ఆన్‌లైన్ ద్వారా ముందుగా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు లేదా నేరుగా సమీపంలోని 'ఆధార్ సేవా కేంద్రం'  లేదా మీసేవ కేంద్రాన్ని సందర్శించవచ్చు.

4/5

చిన్నారి అసలు జనన ధ్రువీకరణ పత్రం, తల్లి లేదా తండ్రి అసలు ఆధార్ కార్డును ఆధార్​ కేంద్రానికి తీసుకెళ్లాలి. ఆధార్ కేంద్రంలో నమోదు ఫారమ్ సమర్పించిన తర్వాత, ఆపరేటర్ చిన్నారి ఫోటో తీస్తారు. తల్లిదండ్రులు తమ బయోమెట్రిక్ ప్రామాణీకరణ ద్వారా అంగీకారం తెలిపాల్సి ఉంటుంది. పత్రాల పరిశీలన ముగిసిన అనంతరం ఆపరేటర్ అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్‌ను అందజేస్తారు. దీనిలోని ఎన్‌రోల్‌మెంట్ ఐడీ ద్వారా ఆధార్ కార్డు పురోగతిని ఆన్‌లైన్‌లో తనిఖీ చేయవచ్చు. ఆధార్ జనరేట్ అయిన తర్వాత యూఐడీఏఐ పోర్టల్ నుంచి ఈ-ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా ప్లాస్టిక్ పీవీసీ కార్డును ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు.

5/5

ఐదేళ్లలోపు పొందిన బాల్ ఆధార్‌లో వేలిముద్రలు ఉండవు కాబట్టి, చిన్నారికి 5 ఏళ్లు రాగానే వేలిముద్రలు, ఐరిస్ స్కాన్, కొత్త ఫోటోను ఉచితంగా అప్‌డేట్ చేయాలి. పాఠశాలల వేదికగా UIDAI ఈ బయోమెట్రిక్ అప్‌డేట్లపై ప్రత్యేక అవగాహన ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. నిర్దేశిత వయస్సులోగా ఈ అప్‌డేట్ పూర్తి చేస్తేనే ఆధార్ కార్డు భవిష్యత్‌లో యాక్టివ్​గా ఉంటుంది. పుట్టిన వెంటనే బాల్ ఆధార్ తీసుకోవడం ద్వారా చిన్నారులకు విద్యా, వైద్య సేవలు పొందడం ఎంతో సులభతరం అవుతుంది.

Related Photos