పిల్లలు పుట్టడం లేదా? మీ సంతానలేమి సమస్యకు ఈ అలవాటే కారణం కావచ్చు!

Published on Sept 19, 2026 11:20 am IST

సంతానోత్పత్తికి.. సరిపడా నిద్రతో పాటు పడుకునే సమయం కూడా అత్యంత కీలకమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దంపతుల్లో హార్మోన్ల సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలంటే ఎలాంటి నిద్ర నియమాలు పాటించాలో ఈ కథనంలో తెలుసుకోండి..

1 / 5

ఇటీవలి కాలంలో ఐటీ ఉద్యోగాలు, నైట్ షిఫ్ట్‌లు, అర్థరాత్రి వరకు ఓటీటీ సిరీస్‌లు చూడటం, సోషల్ మీడియా వాడకం సర్వసాధారణమైపోయింది. రోజంతా పడిన కష్టాన్ని పక్కన పెట్టి రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం చాలామందికి అలవాటుగా మారింది. అయితే ఈ అలవాటు మీ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని తెలుసా? సంతానలేమి సమస్యలతో బాధపడుతున్న యువ దంపతుల సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతోంది. దీనికి కేవలం ఆహార అలవాట్లు, పని ఒత్తిడి మాత్రమే కాదు.. నిద్రపోయే సమయం సరిగ్గా లేకపోవడం కూడా ప్రధాన కారణమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లల కోసం ప్రయత్నించే సమయంలో ఎన్ని గంటలు నిద్రపోతున్నాం అనే దానికంటే, ఏ సమయానికి పడుకుంటున్నామనేదే అసలైన వ్యత్యాసాన్ని చూపుతుందని రిన్యూ హెల్త్‌కేర్ సీనియర్ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, డైరెక్టర్ డాక్టర్ రాజీవ్ అగర్వాల్ వివరించారు.
expand-icon View Photos in a new improved layout

2 / 5

నిద్రకు, సంతానోత్పత్తికి మధ్య 'U' ఆకారపు బంధం ఉంటుందని డాక్టర్ రాజీవ్ తెలిపారు. అంటే తక్కువ నిద్ర ఎంత హానికరమో, అతిగా పడుకోవడం కూడా అంతే ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. "గంటల ప్రాతిపదికన చూస్తే, 6 గంటల కంటే తక్కువ సమయం లేదా 9 గంటల కంటే ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల గర్భం దాల్చే అవకాశాలు తగ్గుతాయి. అధ్యయనాల ప్రకారం.. రోజుకు 7 నుంచి 8.5 గంటల నిద్ర ఉన్న వారిలోనే సంతానోత్పత్తి అవకాశాలు మెరుగ్గా ఉన్నట్లు తేలింది," అని డాక్టర్ రాజీవ్ వెల్లడించారు. కాబట్టి ఎక్కువ సమయం పడుకున్నంత మాత్రాన మంచి జరుగుతుందని భావించడం పొరపాటే.

3 / 5

చాలామంది రాత్రి 2 గంటలకు పడుకుని, ఉదయం 10 గంటలకు లేచి 8 గంటల నిద్ర పూర్తి చేశామని అనుకుంటారు. కానీ శరీరం ఆ విధంగా పనిచేయదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. పడుకునే సమయం మారితే శరీరంలోని జీవ గడియారం దెబ్బతింటుంది."అండం విడుదల కావడానికి తోడ్పడే లూటినైజింగ్ హార్మోన్ విడుదల రాత్రి 12 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య, గాఢ నిద్రలో ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువగా జరుగుతుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పడుకోవడం, రాత్రి 2 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు నిద్రపోవడం ఒక్కటి కావు. రాత్రి ఆలస్యంగా పడుకోవడం వల్ల లూటినైజింగ్ హార్మోన్, ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ విడుదల క్రమం దెబ్బతింటుంది," అని డాక్టర్ రాజీవ్ వివరించారు.

4 / 5

రాత్రి వేళల్లో పనిచేసే మహిళల్లో రుతుక్రమ సమస్యలు, తీవ్రమైన కడుపునొప్పి, గర్భస్రావం అయ్యే ముప్పు ఎక్కువవుతాయి. వారు గర్భం దాల్చడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇక పురుషుల్లో కూడా నిద్రలేమి తీవ్ర ప్రభావం చూపుతుంది. గాఢ నిద్రలో ఉన్నప్పుడే పురుషుల్లో 'టెస్టోస్టెరాన్' హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. నిద్ర సరిగ్గా లేకపోతే ఈ హార్మోన్ తగ్గి, వీర్యకణాల నాణ్యత, సంఖ్య పడిపోతాయి. నిద్రలేమి వల్ల శరీరంలో 'కార్టిసాల్' అనే స్ట్రెస్ హార్మోన్ పెరిగి, అండాల, వీర్యకణాల ఉత్పత్తిని నియంత్రించే 'GnRH' విడుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

5 / 5

సంతానం కోసం.. రాత్రి వేళల్లో కనీసం 7 నుంచి 8 గంటలు క్రమం తప్పకుండా నిద్రపోవాలి. రాత్రి 11 గంటల లోపే నిద్రపోవడం హార్మోన్ల విడుదలకు ఎంతో మేలు చేస్తుంది. నిద్ర సమయం మాత్రమే కాకుండా, మధ్యలో మెలకువ రాకుండా గాఢ నిద్ర ఉండేలా చూసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో నైట్ షిఫ్ట్‌లు చేసేవారు పడుకునే గది చీకటిగా ఉండేలా చూసుకోవాలి. వైద్యుల సలహాతో మెగ్నీషియం గ్లైసినేట్, మెలాటోనిన్ వంటివి పరిగణించవచ్చు. ప్రత్యేకించి మెలాటోనిన్ నిద్రతో పాటు అండాశయంలోని ఫాలికిల్స్‌లో యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి అండాల నాణ్యతను ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడుతుంది.

• శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!