టాప్ 5 ప్రైవేట్ బ్యాంకుల్లో హోమ్ లోన్‌పై వడ్డీ రేట్లు ఇవి..
రెపో రేటును ఆర్బీఐ తగ్గిస్తోంది. ఈ నేపథ్యంలో సొంతింటి కలలను నెరవేర్చుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. మరి మీరు కూడా హోమ్ లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. దేశంలోని టాప్ 5 ప్రైవేట్ బ్యాంకులు అందిస్తున్న హోమ్ లోన్ వడ్డీ రేట్ల వివరాలను ఇక్కడ చూసేయండి..

హెచ్డీఎఫ్సీ బ్యాంక్- రూ. 30లక్షల వరకు- 8.45శాతం నుంచి మొదలు, రూ. 30లక్షల నుంచి రూ. 75లక్షల వరకు- 8.45శాతం నుంచి మొదలు, రూ. 75లక్షల కన్నా ఎక్కువ- 8.45శాతం నుంచి మొదలు.

యాక్సిస్ బ్యాంక్- రూ. 30లక్షల వరకు- 8.75శాతం నుంచి 12.80శాతం వరకు, రూ. 30లక్షల నుంచి రూ. 75లక్షల వరకు- 8.75శాతం నుంచి 12.8శాతం వరకు, రూ. 75లక్షల కన్నా ఎక్కువ- 8.75శాతం నుంచి 9.65శాతం వరకు

ఐసీఐసీఐ బ్యాంక్- రూ. 30లక్షల వరకు- 8.50శాతం నుంచి మొదలు, రూ. 30లక్షల నుంచి రూ. 75లక్షల వరకు- 8.50శాతం నుంచి మొదలు, రూ. 75లక్షల కన్నా ఎక్కువ- 8.50శాతం నుంచి మొదలు.

ఐడీఎఫ్సీ బ్యాంక్- రూ. 30లక్షల వరకు- 8.85శాతం నుంచి మొదలు, రూ. 30లక్షల నుంచి రూ. 75లక్షల వరకు- 8.85శాతం నుంచి మొదలు, రూ. 75లక్షల కన్నా ఎక్కువ- 8.85శాతం నుంచి మొదలు.

కొటాక్ మహీంద్రా బ్యాంక్- రూ. 30లక్షల వరకు- 8.65శాతం నుంచి మొదలు, రూ. 30లక్షల నుంచి రూ. 75లక్షల వరకు- 8.65శాతం నుంచి మొదలు, రూ. 75లక్షల కన్నా ఎక్కువ- 8.65శాతం నుంచి మొదలు.

సోర్స్- పైసా బజార్. ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. లోన్ తీసుకోవడం రిస్కీ అని గుర్తుపెట్టుకోండి.

E-Paper

