Almonds : రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలో తెలుసా? అద్భుతమైన ఫలితాలు చూస్తారు..!

బాదం పప్పును రోజూ తినడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం రాకుండా అడ్డుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి, మెదడు చురుగ్గా పనిచేయడానికి బాదం ఎంతో మేలు చేస్తుంది. రోజుకు ఎన్ని తినాలో నిపుణుల మాటల్లో తెలుసుకోండ

Published on: Jun 22, 2026 11:20 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అందరికీ ఒక సవాలుగా మారింది. అయితే, మన వంటిట్లోనే ఉండే డ్రై ఫ్రూట్స్ ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్‌లో రారాజుగా పిలిచే బాదం పప్పు మన శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. బాదంలో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ (ఆరోగ్యకరమైన కొవ్వులు), డైటరీ ఫైబర్, ప్రొటీన్లతో పాటు విటమిన్ ఈ వంటి అత్యవసర విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. రోజూ క్రమం తప్పకుండా బాదం పప్పులను తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
expand-iconView Photos in a new improved layout
Published on Jun 22, 2026 11:20 AM

2/6

గుండెకు శ్రీరామరక్ష- బాదం పప్పు గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఇది శరీరంలోని లో-డెన్సిటీ లిపోప్రోటీన్ లేదా 'చెడు' కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడమే కాకుండా, రక్తనాళాల్లో వచ్చే ఇన్​ఫ్లమేషన్​ని నివారిస్తుంది. ఇందులో ఉండే మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు రక్తపోటు స్థిరంగా ఉండేలా చూస్తాయి.

3/6

షుగర్​ లెవల్స్​ అదుపులో- బాదం పప్పులో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. పైగా ఇందులో మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వల్ల ఆహారం తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా ఇది అడ్డుకుంటుంది. టైప్ 2 డయాబెటిస్ లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ సమస్యతో బాధపడేవారికి ఇది ఒక అద్భుతమైన స్నాక్స్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

4/6

బరువు తగ్గేందుకు బెస్ట్- బాదంలో క్యాలరీలు ఎక్కువే ఉన్నప్పటికీ, బరువు తగ్గడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఇందులో ఉండే ప్రొటీన్, ఫైబర్ కాంబినేషన్ వల్ల బాదం తిన్న తర్వాత కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది ఆకలిని అదుపులో ఉంచి, రోజంతా అదనపు క్యాలరీలు తీసుకోకుండా నియంత్రిస్తుంది.

5/6

చురుకైన మెదడు- బాదంలో ఉండే విటమిన్ ఈ, రైబోఫ్లావిన్ వంటి పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. వయసు పెరగడం వల్ల వచ్చే మతిమరుపు వంటి సమస్యలను తగ్గించడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయని నిపుణులు వివరిస్తున్నారు.

6/6

శరీరానికి అవసరమైన పోషకాలు అందాలనే ఉద్దేశంతో బాదం పప్పులను విపరీతంగా తినకూడదు. క్యాలరీలు ఎక్కువ కాకుండా ఉండాలంటే రోజుకు పావు కప్పు లేదా సుమారు 23 బాదం పప్పులు (దాదాపు 1 ఔన్స్) తింటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బాదం పప్పులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే పైన ఉండే పొట్టు తీసి తినడం వల్ల వాటిలోని పోషకాలను మన శరీరం మరింత సులభంగా గ్రహిస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Related Photos