...
...
Next Story

రూ.15లక్షల లోపు ధరలో లభిస్తున్న బెస్ట్​ ఎలక్ట్రిక్​ కార్లు ఇవి- రేంజ్​ కూడా ఎక్కువే!

కొత్తగా ఎలక్ట్రిక్​ కారు కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. రూ.15లక్షలలోపు ధర ఇండియాలో అందుబాటులో ఉన్న బెస్ట్​ ఎలక్ట్రిక్​ కార్ల వివరాలను ఇక్కడ చూసేయండి. వీటి రేంజ్​ కూడా ఎక్కువే..

Published on: Jun 16, 2025, 10:50:57 IST
By ,
Prefer HTon Google
Advertisement
<p>ఎంజీ విండ్సర్​ ఈవీ- ఇండియాలో ఇప్పుడు బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ కారుగా దూసుకెళుతోంది ఈ విండ్సర్​ ఈవీ. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 14లక్షలుగా ఉంది. ఇందులో 58 కేడబ్ల్యూహెచ్​, 52.9 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్స్​ ఉన్నాయి. వీటిని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే వరుసగా 330కి.మీ- 449 కి.మీ రేంజ్​ని ఇస్తాయి.</p>

ఎంజీ విండ్సర్​ ఈవీ- ఇండియాలో ఇప్పుడు బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ కారుగా దూసుకెళుతోంది ఈ విండ్సర్​ ఈవీ. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 14లక్షలుగా ఉంది. ఇందులో 58 కేడబ్ల్యూహెచ్​, 52.9 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్స్​ ఉన్నాయి. వీటిని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే వరుసగా 330కి.మీ- 449 కి.మీ రేంజ్​ని ఇస్తాయి.

టాటా నెక్సాన్​ ఈవీ- టాటా మోటార్స్​కి బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఉంది ఈ నెక్సాన్​ ఈవీ. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 12.5లక్షలుగా ఉంది. ఇందులో 45 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 275 కి.మీ వరకు రేంజ్​ని ఇస్తుంది. ఇందులో 46.08 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ కూడా ఉంది. దీని రేంజ్​ దాదాపు 490 కి.మీ.

టాటా పంచ్​ ఈవీ- టాటా నుంచి అందుబాటులో ఉన్న మరో మోడల్​ ఈ టాటా పంచ్​ ఈవీ. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 9.99లక్షలుగా ఉంది. టాప్​ ఎండ్​ మోడల్​ రూ. 14.45లక్షలకే లభిస్తుండటం విశేషం! ఇందులోని 25 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీని ఛార్జ్​ చేస్తే 315 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. అదే సమయంలో 35 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ 421 కి.మీ రేంజ్​ని ఇస్తుంది.

సిట్రోయెన్​ ఈసీ3- ఇండియాలో రూ. 15లక్షల బడ్జెట్​లోపు అందుబాటులో ఉన్న మరో ఎలక్ట్రిక్​ కారు ఈ సిట్రోయెన్​ ఈసీ3. దీని ప్రారంభ ఎక్స్​షోరూం దర రూ. 13లక్షల వరకు ఉంది. ఇందులో 29.2 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 320 కి.మీ రేంజ్​ని ఇస్తుంది.

విండ్సర్​ ఈవీ ప్రో- రూ.15లక్షలకు మించి, ఇంకాస్త ఎక్కువ ఖర్చు చేయగలిగితే.. ఎంజీ విండ్సర్​ ఈవీ ప్రోని మీరు పరిగణించవచ్చు. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 18.10లక్షలుగా ఉంది. ఇందులో 52.9 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ఉంది. దీని రేంజ్​ దాదాపు 450 కి.మీలు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe