8000ఎంఏహెచ్ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్ ఇది! బోలెడు AI ఫీచర్స్‌తో లాంచ్- ధర ఎంతంటే..
మీరు ఇప్పటివరకు 6000ఎంఏహెచ్ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్ చూసుంటారు, 7000ఎంఏహెచ్ బ్యాటరీ గ్యాడ్జెట్‌ని చూసుంటారు. కానీ 8000ఎంఏహెచ్ బ్యాటరీతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ని చూశారా? రెడ్ మ్యాజిక్ 11 ప్రోలో 8000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది! ఈ స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు..
రెడ్ మ్యాజిక్ 11 ప్రోలో 6.85 ఇంచ్ పెద్ద డిస్ప్లే ఉంటుంది. దీని రిఫ్రెష్ రేట్ 144హెచ్‌జెడ్. స్క్రీన్ టు బాడీ రేషియో 95.3 పర్సెంట్. స్క్రీన్‌కి స్టార్ షీల్డ్ ఐ ప్రొటెక్షన్ 2.0, మ్యాజిక్ టచ్ 3.0, వెట్ హ్యాండ్ టచ్ సపోర్ట్ వంటివి కూడా ఉన్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో పవర్ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 ప్రాసెసర్ ఉంటుంది. రెడ్ మ్యాజిక్ ఓఎస్ 11పై ఇది పనిచేస్తుంది. 24జీబీ ర్యామ్, 1టీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. ఇదొక గేమింగ్ స్మార్ట్‌ఫోన్. ఇందులో క్యూబ్ గేమ్ ఇంజిన్ 3.0, డ్యూయెల్ విండ్ అండ్ వాటర్ కూలింగ్ సిస్టెమ్, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ 4.0 వంటివి ఉన్నాయి.
రెడ్ మ్యాజిక్ 11 ప్రోలో 50ఎంపీ+50ఎంపీతో కూడిన రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపీ ఫ్రెంట్ కెమెరాని ఇచ్చింది సంస్థ. ఏఐ రైటింగ్ అసిస్టెన్స్, ఏఐ ఆబ్జెక్ట్ రికగ్నీషన్, ఏఐ సర్కిల్ టు సెర్చ్, ఏఐ టాక్టికల్ కోచ్ వంటి ఏఐ ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ సెటప్ హైలైట్ అని చెప్పుకోవాలి! ఇందులో 8000ఎంఏహెచ్ బడా బ్యాటరీ ఉంటుంది. అంతేకాదు దీనికి 120డబ్ల్యూ వయర్డ్- 80డబ్ల్యూ వయర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుండటం విశేషం..
రెడ్ మ్యాజిక్ 11 ప్రో చైనాలో లాంచ్ అయ్యింది. చైనాలో ఈ స్మార్ట్‌ఫోన్ వేరియంట్లు ధరలు.. 12జీబీ ర్యామ్-256జీబీ వేరియంట్‌కు 4999 యువాన్ (సుమారు రూ. 62,000), 16జీబీ ర్యామ్-512జీబీ స్టోరేజ్ వేరియంట్ 5,699 యువాన్లు (సుమారు రూ. 70వేలు)గా ఉన్నాయి.
E-Paper

