...
...
Next Story

సింగిల్​ ఛార్జ్​తో 490 కి.మీ వరకు రేంజ్​- ఈ 7 సీటర్​ ఎలక్ట్రిక్​ కారు ఫ్యామిలీకి బెస్ట్​!

కియా క్యారెన్స్​ క్లావిస్​ ఇటీవలే ఇండియాలో లాంచ్​ అయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు, ఈ ఎంపీవీకి ఈవీ వర్షెన్​ కూడా రాబోతోంది. కియా క్యారెన్స్​ క్లావిస్​ ఈవీ జులై 5న ఇండియాలో అడుగుపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో ఈ లాంగ్​ రేంజ్​ ఎలక్ట్రిక్​ కారు వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Jul 4, 2025, 07:19:19 IST
By ,
Prefer HTon Google
Advertisement
<p>ఈ కియా క్యారెన్స్​ క్లావిస్​ ఈవీలో రెండు బ్యాటరీ ప్యాక్​ ఆప్షన్స్​ ఉంటాయి. 42 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ని ఛార్జ్​ చేస్తే 390 కి.మీ వరకు రేంజ్​ని ఇస్తుంది. ఇక 51.5 కేడబ్ల్యూహెచ్​ బ్యాటర్​ ప్యాక్​ని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 473 కి.మీ వరకు రేంజ్​ని ఇస్తుంది. అయితే, ఇది 490 కి.మీ వరకు కూడా వెళుతుందని సంస్థ చెబుతోంది.</p>

ఈ కియా క్యారెన్స్​ క్లావిస్​ ఈవీలో రెండు బ్యాటరీ ప్యాక్​ ఆప్షన్స్​ ఉంటాయి. 42 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ని ఛార్జ్​ చేస్తే 390 కి.మీ వరకు రేంజ్​ని ఇస్తుంది. ఇక 51.5 కేడబ్ల్యూహెచ్​ బ్యాటర్​ ప్యాక్​ని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 473 కి.మీ వరకు రేంజ్​ని ఇస్తుంది. అయితే, ఇది 490 కి.మీ వరకు కూడా వెళుతుందని సంస్థ చెబుతోంది.

కియా తొలి మేడ్​-ఇన్​- ఇండియా ఎలక్ట్రిక్​ కారు ఈ క్యారెన్స్​ క్లావిస్​ ఈవీ. లాంచ్​ తర్వాత ఈ మోడల్​ హ్యుందాయ్​ క్రెటా ఎలక్ట్రిక్​, టాటా కర్వ్​ ఈవీ, మహీంద్రా బీఈ6 వంటి ఈవీలతో పోటీ పడుతుంది.

కియా క్యారెన్స్​ క్లావిస్​ ఈవీలో 6 ఎయిర్​ బ్యాగులతో పాటు అనేక అడాస్​ లెవల్​ 2 సేఫ్టీ ఫీచర్స్​ కూడా ఉంటాయి.

కియా క్యారెన్స్​ క్లావిస్​ ఈవీలో అడ్వాన్స్​డ్​ టెక్నాలజీ ఫీచర్లకు కొదవే లేదు! ఇందులో పానోరమిక్​ సన్​రూఫ్​, డ్యూయెల్​ జోన్​ ఆటోమెటిక్​ క్లైమేట్​ కంట్రోల్​, రేర్​ ఏసీ వెంట్స్​, వెంటిలేటెడ్​ ఫ్రెంట్​ సీట్స్​, వైర్​లెస్​ ఫోన్​ ఛార్జింగ్​, అనేక కార్​ కనెక్టింగ్​ ఫీచర్లు, 360 డిగ్రీ వ్యూ కెమెరా సిస్టెమ్​ వంటివి ఉంటాయి.

ఈ ఎలక్ట్రిక్​ ఎంపీవీ డిజైన్​ క్యారెన్స్​ క్లావిస్​ ఐసీఈ ఇంజిన్​నే పోలి ఉంటుంది. కాగా, ముందువైపు ఛార్జింగ్​ పాయింట్​ వస్తుంది. కేబిన్​లో మాత్రం కొత్త స్టీరింగ్​ వీల్​, కన్సోల్​ వంటివి ఉండొచ్చు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe