6500ఎంఏహెచ్ బ్యాటరీతో Oppo A6x- రూ. 15వేల కన్నా తక్కువకే అదిరే ఫీచర్స్!
ఇండియాలోకి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ని తీసుకొచ్చింది ఒప్పో సంస్థ. రూ. 15వేల కన్నా తక్కువ ధరకు ఒప్పో ఏ6ఎక్స్ అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ సహా ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఒప్పో ఏ6ఎక్స్ అనేది ఒక 5జీ స్మార్ట్‌ఫోన్. ఇందులో 6.75 ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ ప్యానెల్ ఉంటుంది. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 240హెచ్‌జెడ్ శాంప్లింగ్ రేట్ దీని సొంతం. ఈ గ్యాడ్జెట్ పీక్ బ్రైట్నెస్ 1125 నిట్స్.
ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్ఓసీ ప్రాసెసర్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ఓఎస్ 15 సాఫ్ట్‌వేర్‌పై ఇది పనిచేస్తుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వరకు ఆప్షన్స్ ఉన్నాయి. గేమర్స్ కోసం ఇందులో ఏఐ గేమ్ బూస్ట్ ఫీచర్ లభిస్తుండటం విశేషం.
ఈ ఒప్పో ఏ6ఎక్స్‌లో 13ఎంపీ రేర్ కెమెరా, 5ఎంపీ ఫ్రెంట్ కెమెరాను అందించింది సంస్థ. ఐస్ బ్లూ, ఆలివ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్‌లో ఇది లభిస్తోంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత దాని బ్యాటరీ! ఇందులో 6,500ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంటుంది. దీనికి 45డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తోంది. 1శాతం నుంచి 41శాతానికి ఛార్జ్ అవ్వడానికి 30 నిమిషాల సమయం పడుతుందని సంస్థ చెబుతోంది.
ఒప్పో ఏ6ఎక్స్ 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ. 13,4999గా ఉంది. 4జీబీ+128జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్ ధరలు వరుసగా రూ. 13,4999- రూ. 14,499గా ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఒప్పో స్టోర్స్ సహా ఇతర రీటైల్ స్టోర్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.
E-Paper

