Tirumala 121 kg Gold Donation : తిరుమల శ్రీవారికి రూ.207.6 కోట్ల బంగారు ఆభరణాలు - ఈ ఫొటోలు చూడండి

Tirumala gold donation 121 kg Photos : చెన్నై దాతల దంపతులు తిరుమల శ్రీవారికి 121 కిలోల 24 క్యారెట్ల బంగారు ఆభరణాలను సమర్పించారు. సీఎం చంద్రబాబు సమక్షంలో జరిగిన ఈ చారిత్రాత్మక కానుక విలువ రూ.207.6 కోట్లు. ఆభరణాల ఫొటోలను టీటీడీ విడుదల చేసింది.

Published on: Nov 26, 2026 4:53 PM IST
google-icon
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/10

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి రూ.207.6 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలను చెన్నైకి చెందిన దాతల దంపతులు గురువారం సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చరిత్రలో ఇదో అరుదైన, చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది.

Published on Nov 26, 2026 4:53 PM

2/10

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు సమక్షంలో దాతలు శ్రీ వర్ధమాన్ జైన్, శ్రీమతి రాధికా జైన్ ఈ భారీ కానుకను స్వామివారికి అర్పించారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఉంచిన 46 బంగారు ఆభరణాలను ముఖ్యమంత్రి, దాతల దంపతులు, కుటుంబ సభ్యులు పరిశీలించారు. దాతల ఉదారతను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రశంసించారు.

3/10

ఆ తర్వాత దాతల కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు పళ్లెంలో ఆభరణాలను తలపై పెట్టుకుని ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేశారు. గర్భగుడిలోకి వెళ్లి స్వామివారి సన్నిధిలో ఆభరణాలను ఉంచి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

4/10

తిరుమల ఆలయం కోసం 33 రకాలకు చెందిన 46 బంగారు ఆభరణాలను రూపొందించేందుకు మొత్తం 121 కిలోల 24 క్యారెట్ల బంగారాన్ని వినియోగించారు. మేకింగ్ ఛార్జీలతో కలిపి ఈ 121 కిలోల బంగారం మొత్తం విలువ రూ.207.6 కోట్లుగా నిర్ధారించారు.

5/10

ఇందులో తిరుమల ఆలయ ఆభరణాల కోసం 106 కిలోల 24 క్యారెట్ల బంగారాన్ని వాడారు. మిగిలిన 15 కిలోల 24 క్యారెట్ల బంగారాన్ని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వస్త్రం తయారీ కోసం ఉపయోగిస్తారు.

6/10

బంగారంతో పాటు ఈ కానుకలో వజ్రాలు, విలువైన రత్నాలు కూడా ఉన్నాయి. మొత్తం వజ్రాల బరువు 238.2 క్యారెట్లు కాగా, విలువైన రత్నాలు 2,247.7 క్యారెట్లు ఉన్నాయి.

7/10

నీలమణులు 91.6 క్యారెట్లు, పసుపు నీలమణులు 84.2 క్యారెట్లు, కెంపులు, పచ్చలు కలిపి 2,916.5 గ్రాములు ఉన్నాయి. వీటితో పాటు సాలిగ్రామ రాళ్లను కూడా సమర్పించారు.

8/10

పాద కవచాలు – 2, అందెలు – 2, పొగడ – 1, తులసీ పత్ర పుష్పము – 1,,అష్టోత్తర శతనామ కాసుల హారం – 1,చతుర్భుజ లక్ష్మీ హారం – 1, పులిగోరు – 1, అష్టోత్తర పత్ర హారం ఒకటి ఉన్నాయి.

9/10

నర హారాలు – 1, గంటల మొలతాడు – 1,,సువర్ణ కంఠి – 1, కనక పుష్పము – 1, వైష్ణవం – 1, మొలచెయి – 1, కటి సూత్రం (సిల్వర్ ఫాయిల్) – 1, నాగాభరణ వడ్డాణం – 1, చైన్ – 1 ఉన్నట్లు టీటీడీ తెలిపింది.

10/10

ఇక అభయహస్తాల కంకణాలు – 5, చందనవంక కంఠి – 1, వైకుంఠ హస్తము ఒకటి, కత్తి హస్తము – 1, నాగాభరణ కడియాలు – 2, నాగాభరణాలు – 2, బాహువులు – 2, సాలిగ్రామ హారం (రెండు భాగాలు) – 2, కమలాల త్రిభుజ సాలిగ్రామ హారాలు (రెండు భాగాలు) – 2, సీమ కవచాలు – 1, శంఖ కవచం – 1, చక్ర కవచం – 1, ముత్యాల పూస – 1, కిరీటం ఒకటి ఉన్నాయి.

Related Photos