CJP protest : అడుగడుగునా బ్యారికేడ్లు, క్షణక్షణం తనిఖీలు- దిల్లీలో కనిపించని నిరసనకారులు! ఫొటోలు..
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ సీజేపీ తలపెట్టిన నిరసనలపై దిల్లీ పోలీసులు తమ ప్రతాపం చూపించారు! నగరంవ్యాప్తంగా అనేక ఆంక్షలు విధించారు, కీలక నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఫలితంగా జంతర్ మంతర్ ప్రాంగణం వద్ద బ్యారికేడ్లు తప్ప, నిరసనకారులు కనిపించడం లేదు.

నిరసనల్లో పాల్గొనేందుకు ముంబై నుచి దిల్లీ వచ్చిన సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కేని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం దిల్లీ విమానాశ్రయంలో అడుగుపెట్టిన వెంటనే, విమానం లోపలికి వెళ్లిన మహిళా పోలీసులు.. దీప్కేని డీటైన్ చేస్తున్నట్టు తెలిపారు. మరో ఇద్దరు సీజేపీ సభ్యులను కూడా డీటైన్ చేశారు. వీరిని వేరువేరు డిటెన్షన్ క్యాంపుల్లో పెట్టారు.
(ANI Video Grab)
సీజేపీ నిరసనల వేళ 26వేల మంది బలగాలు దిల్లీలోకి దిగినట్టు తెలుస్తోంది. జంతర్ మంతర్ నిరసన ప్రాంగణం వద్ద అడుగడుగునా బ్యారికేడ్లు వేశారు. అటువైపు ఎవరినీ వెళ్లనివ్వడం లేదు. ఎవరైనా వెళితే ఐడీ కార్డులు అడుగుతున్నారు. ఐడీ లేని వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. నిరసనల నేపథ్యంలో ఇండియా గేట్ వద్ద తీసిన ఫొటో ఇది.
(PTI)
దిల్లీవైపు వెళుతున్న ప్రతీ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునచ్చిన నిరసనల్లో పాల్గొన వద్దని సూచిస్తున్నారు. వాహనాల్లో యువకులు కనిపిస్తే మరిన్ని చర్యలు చేపడుతున్నారు. దిల్లీ- నోయిడా డైరక్ట్ ఫ్లైవే బార్డర్ వద్ద తీసిని ఫొటో ఇది.
(PTI)
ఈ ఆందోళనకు పోలీసులు అనుమతి నిరాకరించడమే కాకుండా, నగరంలో ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా దిల్లీని ఉక్కు పిడికిట్లోకి తీసుకున్నారు! శనివారం ఉదయం నుంచే జంతర్ మంతర్ పరిసరాలు, కన్నాట్ ప్లేస్, పటేల్ చౌక్ మార్గాలు ఖాకీమయంగా మారిపోయాయి. మైకుల్లో హెచ్చరికలు చెబుతూ, కిలోమీటర్ల మేర బహుళ అంచెల బారికేడ్లు, కవాతు చేస్తున్న సైనిక బలగాలతో సెంట్రల్ దిల్లీ ఒక మిలిటరీ జోన్‌ను తలపిస్తోంది.
(PTI)సీజేపీ నిరసనల్లో పాల్గొనేందుకు వెళ్లిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఇలా వాహనంలో పెట్టారు. జంతర్ మంతర్ వద్ద ఎవరు కనిపించినా పోలీసులు వెంటనే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
(REUTERS)
E-Paper

