వర్షాకాలంలో చాలా మందికి చెవులు ఎందుకు మూసుకుపోతాయి? చిట్కాలు

వర్షాకాలంలో చెవి దిబ్బడ, నొప్పి, బరువుగా అనిపించడం వంటి చెవి సమస్యలు పెరగవచ్చు. తేమను నివారించడం, సాధారణ ఇంటి చిట్కాలు ఈ సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి.

Published on: Jul 9, 2026 10:15 AM IST
google-icon
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link
1/4
<p>నెలల తరబడి మండే ఎండల తర్వాత వర్షాలు మొదలయ్యాయి. వర్షాకాలం రాకతో చల్లని గాలులు అన్నిచోట్లా వీచడం మెుదలైంది. వర్షాకాలం రాకతో గాలిలో తేమ పెరుగుతుంది. ఈ కాలం మండే ఎండల నుండి ఉపశమనం కలిగించినప్పటికీ, ఇది చాలా మందిని ఇబ్బంది పెడుతుంది.</p> expand-iconView Photos in a new improved layout
Published on Jul 9, 2026 10:15 AM

నెలల తరబడి మండే ఎండల తర్వాత వర్షాలు మొదలయ్యాయి. వర్షాకాలం రాకతో చల్లని గాలులు అన్నిచోట్లా వీచడం మెుదలైంది. వర్షాకాలం రాకతో గాలిలో తేమ పెరుగుతుంది. ఈ కాలం మండే ఎండల నుండి ఉపశమనం కలిగించినప్పటికీ, ఇది చాలా మందిని ఇబ్బంది పెడుతుంది.

2/4
<p>వర్షాకాలంలో చాలా మంది చెవి నొప్పి గురించి ఫిర్యాదు చేస్తారు. కానీ దీనికి కారణం వారికి అర్థం కాదు. గాలిలోని తేమ చెవుల ఆరోగ్యానికి సమస్యలను సృష్టిస్తుంది. మన చెవుల లోపలి భాగం ఎల్లప్పుడూ పొడిగా ఉండాలని నమ్ముతారు, కానీ వర్షాకాలంలో నిరంతరం ఉండే తేమ చెవి గులిమిని మెత్తబరచి, దాని పనితీరుకు ఆటంకం కలిగిస్తుంది.  అంతేకాకుండా చెవి సమస్యలు ఉన్నవారికి వారి చెవులలో బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చాలా సందర్భాలలో చెవి నొప్పికి, చెవులు మూసుకుపోయినట్టుగా అనిపించడం తీవ్రమైన అనారోగ్యం కారణం కాదు. కొన్నిసార్లు, జలుబు లేదా అలర్జీలు కూడా చెవి నొప్పికి కారణం కావచ్చు.</p> expand-iconView Photos in a new improved layout
Published on Jul 9, 2026 10:15 AM

వర్షాకాలంలో చాలా మంది చెవి నొప్పి గురించి ఫిర్యాదు చేస్తారు. కానీ దీనికి కారణం వారికి అర్థం కాదు. గాలిలోని తేమ చెవుల ఆరోగ్యానికి సమస్యలను సృష్టిస్తుంది. మన చెవుల లోపలి భాగం ఎల్లప్పుడూ పొడిగా ఉండాలని నమ్ముతారు, కానీ వర్షాకాలంలో నిరంతరం ఉండే తేమ చెవి గులిమిని మెత్తబరచి, దాని పనితీరుకు ఆటంకం కలిగిస్తుంది. అంతేకాకుండా చెవి సమస్యలు ఉన్నవారికి వారి చెవులలో బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చాలా సందర్భాలలో చెవి నొప్పికి, చెవులు మూసుకుపోయినట్టుగా అనిపించడం తీవ్రమైన అనారోగ్యం కారణం కాదు. కొన్నిసార్లు, జలుబు లేదా అలర్జీలు కూడా చెవి నొప్పికి కారణం కావచ్చు.

3/4
<p>నిపుణుల అభిప్రాయం ప్రకారం, చెవి మూసుకుపోతున్నట్టుగా అనిపించేవారు.. వర్షంలో తడవకుండా ఉండాలి. ఒకవేళ తడిస్తే, చెవులను పూర్తిగా ఆరబెట్టుకోవాలి. చెవిలో గులిమిని తీసిన తర్వాత కూడా మీకు చెవి దిబ్బడగా లేదా బరువుగా అనిపిస్తే, మీరు కొన్ని సులభమైన, ప్రభావవంతమైన ఇంటి చిట్కాలను ప్రయత్నించవచ్చు.</p> expand-iconView Photos in a new improved layout
Published on Jul 9, 2026 10:15 AM

నిపుణుల అభిప్రాయం ప్రకారం, చెవి మూసుకుపోతున్నట్టుగా అనిపించేవారు.. వర్షంలో తడవకుండా ఉండాలి. ఒకవేళ తడిస్తే, చెవులను పూర్తిగా ఆరబెట్టుకోవాలి. చెవిలో గులిమిని తీసిన తర్వాత కూడా మీకు చెవి దిబ్బడగా లేదా బరువుగా అనిపిస్తే, మీరు కొన్ని సులభమైన, ప్రభావవంతమైన ఇంటి చిట్కాలను ప్రయత్నించవచ్చు.

4/4
<p>ఉదాహరణకు చెవి చుట్టూ గోరువెచ్చని నీటిని లేదా గోరువెచ్చని గుడ్డను పెట్టడం, 5 నుండి 10 నిమిషాల పాటు ఆవిరి పీల్చడం చేయవచ్చు. గోరువెచ్చని నీటితో పుక్కిలించడం వంటివి కూడా గొంతుకు, చెవి నాళానికి ఉపశమనాన్ని అందిస్తాయి. అయితే ఈ ఇంటి చిట్కాలు కేవలం చెవులు మూసుకుపోవడం, ప్రారంభ నొప్పిని మాత్రమే తగ్గించగలవని గుర్తుంచుకోవడం ముఖ్యం. చెవి నొప్పి, బరువుగా అనిపించడం ఎక్కువ కాలం కొనసాగితే, తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.</p> expand-iconView Photos in a new improved layout
Published on Jul 9, 2026 10:15 AM

ఉదాహరణకు చెవి చుట్టూ గోరువెచ్చని నీటిని లేదా గోరువెచ్చని గుడ్డను పెట్టడం, 5 నుండి 10 నిమిషాల పాటు ఆవిరి పీల్చడం చేయవచ్చు. గోరువెచ్చని నీటితో పుక్కిలించడం వంటివి కూడా గొంతుకు, చెవి నాళానికి ఉపశమనాన్ని అందిస్తాయి. అయితే ఈ ఇంటి చిట్కాలు కేవలం చెవులు మూసుకుపోవడం, ప్రారంభ నొప్పిని మాత్రమే తగ్గించగలవని గుర్తుంచుకోవడం ముఖ్యం. చెవి నొప్పి, బరువుగా అనిపించడం ఎక్కువ కాలం కొనసాగితే, తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.

Related Photos