Weight loss : బరువు తగ్గాలనుకుంటున్నారా? మీ డైట్ నుంచి ఈ ఆహారాలు, డ్రింక్స్‌ని వెంటనే తీసేయండి..
బరువు తగ్గడం అనేది కేవలం క్యాలరీలను లెక్కించడం మాత్రమే కాదు, సరైన ఆహార ఎంపికల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గి, ఉత్సాహంగా ఉండాలంటే మీ ఆహారపు అలవాట్ల నుంచి తప్పనిసరిగా తొలగించాల్సిన 6 పదార్థాల జాబితా ఇది..
పంచదార అధికంగా ఉండే పానీయాలు : బరువు పెరగడానికి ప్రధాన కారణం సోడాలు, స్వీటెన్డ్ కాఫీలు, ప్యాక్ చేసిన పండ్ల రసాలు. వీటిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కానీ పోషకాలు మాత్రం సున్నా. వీటితో శరీరానికి ఎలాంటి ఉపయోగం లేదు. వీటికి బదులుగా మంచి నీరు, హెర్బల్ టీ లేదా పండ్ల ముక్కలు వేసిన ఇన్ఫ్యూజ్డ్ వాటర్‌ను తీసుకోండి. ఇది మీ క్యాలరీలను తగ్గించడమే కాకుండా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.
రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు : వైట్ బ్రెడ్, మైదా వంటి రిఫైన్డ్ పిండి పదార్థాల్లో పీచు పదార్థం ఉండదు. ఇవి తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి, కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేసేలా చేస్తాయి. వీటికి బదులుగా బ్రౌన్ రైస్, చిలగడదుంపలు లేదా క్వినోవా వంటి తృణధాన్యాలను ఎంచుకోండి. ఇవి కడుపు నిండుగా ఉంచి, శక్తిని ఇస్తాయి.
ఫాస్ట్ ఫుడ్ : బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ రుచిగా ఉన్నప్పటికీ, అందులో అనారోగ్యకరమైన కొవ్వులు, చక్కెరలు, అధిక క్యాలరీలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎలాంటి పోషకాలను అందించవు సదా పోగా, అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు ఇంట్లోనే తాజా కూరగాయలతో వండుకున్న ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం.
షుగర్ సెరియల్స్ : చాలా బ్రేక్‌ఫాస్ట్ సెరియల్స్ ఆరోగ్యకరమైనవిగా మార్కెటింగ్ అవుతుంటాయి. కానీ వాటిలో చక్కెర శాతం చాలా ఎక్కువ. ఇవి తిన్న కాసేపటికే నీరసం వచ్చేలా చేస్తాయి. ఉదయాన్నే ఓట్స్, గ్రీక్ యోగర్ట్ లేదా ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.
అధిక క్యాలరీల కండిమెంట్స్ : మనం వాడే మయోనైజ్, కెచప్, సలాడ్ డ్రెస్సింగ్స్‌లో కూడా చక్కెర, క్యాలరీలు అధికంగా ఉంటాయి. ఇవి రుచిని పెంచుతాయి కానీ బరువు తగ్గడాన్ని అడ్డుకుంటాయి. వీటికి హెల్తీ ప్రత్యామ్నాయాలు తెలుసుకుని వాడుకోండి.
గుర్తుంచుకోండి, బరువు తగ్గడం అనేది ఒక ప్రయాణం. చిన్న చిన్న మార్పులే పెద్ద ఫలితాలను ఇస్తాయి. సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా మీ లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు.
E-Paper

