Kohli vs Head : విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్​ మధ్య అసలు గొడవేంటి? అసలేం జరిగింది?

SRH vs RCB : హైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 55 పరుగుల తేడాతో ఆర్సీబీపై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ఫలితం కంటే.. మైదానంలో విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య జరిగిన కోల్డ్ వార్ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.

Published on: May 23, 2026 10:43 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

మ్యాచ్ ముగిసిన తర్వాత సాంప్రదాయం ప్రకారం ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకుంటారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో నవ్వుతూ షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. కానీ, అతని పక్కనే నిలబడి చేతిని చాచిన ట్రావిస్ హెడ్‌ను కోహ్లీ కనీసం కంటిచూపుతో కూడా చూడకుండా, పూర్తిగా విస్మరిస్తూ ముందుకు సాగిపోయాడు. కోహ్లీ ప్రవర్తనతో షాకైన హెడ్.. చేసేదేమీ లేక ముందుకెళిపోయాడు. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
(ANI Picture Service)expand-iconView Photos in a new improved layout
Published on May 23, 2026 10:43 AM

మ్యాచ్ ముగిసిన తర్వాత సాంప్రదాయం ప్రకారం ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకుంటారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో నవ్వుతూ షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. కానీ, అతని పక్కనే నిలబడి చేతిని చాచిన ట్రావిస్ హెడ్‌ను కోహ్లీ కనీసం కంటిచూపుతో కూడా చూడకుండా, పూర్తిగా విస్మరిస్తూ ముందుకు సాగిపోయాడు. కోహ్లీ ప్రవర్తనతో షాకైన హెడ్.. చేసేదేమీ లేక ముందుకెళిపోయాడు. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

(ANI Picture Service)

2/5

వివాదానికి కారణం ఏంటి?- ఆర్సీబీ భారీ ఛేజింగ్‌కు దిగినప్పుడు విరాట్ కోహ్లీ క్రీజులో ఉన్న సమయంలో ఈ వివాదానికి బీజం పడినట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో ట్రావిస్ హెడ్‌ని ఎస్‌ఆర్‌హెచ్ జట్టు కొన్నిసార్లు ఇంపాక్ట్ ప్లేయర్‌గా వాడుకుని సబ్‌స్టిట్యూట్ చేసింది. దీనిని మనసులో ఉంచుకుని కోహ్లీ క్రీజులో ఉన్నప్పుడు హెడ్‌ని ఉద్దేశించి.. తనకు "కొన్ని బంతులు బౌలింగ్ చేయాలని", అలాగే 'ఇంపాక్ట్ సబ్' వైపు సైగలు చేస్తూ స్లెడ్జింగ్‌కు దిగాడు. అయితే, ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. కేవలం 11 బంతుల్లో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
(ANI Pic Service)expand-iconView Photos in a new improved layout
Published on May 23, 2026 10:43 AM

వివాదానికి కారణం ఏంటి?- ఆర్సీబీ భారీ ఛేజింగ్‌కు దిగినప్పుడు విరాట్ కోహ్లీ క్రీజులో ఉన్న సమయంలో ఈ వివాదానికి బీజం పడినట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో ట్రావిస్ హెడ్‌ని ఎస్‌ఆర్‌హెచ్ జట్టు కొన్నిసార్లు ఇంపాక్ట్ ప్లేయర్‌గా వాడుకుని సబ్‌స్టిట్యూట్ చేసింది. దీనిని మనసులో ఉంచుకుని కోహ్లీ క్రీజులో ఉన్నప్పుడు హెడ్‌ని ఉద్దేశించి.. తనకు "కొన్ని బంతులు బౌలింగ్ చేయాలని", అలాగే 'ఇంపాక్ట్ సబ్' వైపు సైగలు చేస్తూ స్లెడ్జింగ్‌కు దిగాడు. అయితే, ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. కేవలం 11 బంతుల్లో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

(ANI Pic Service)

3/5

కోహ్లీ అవుట్ కాగానే ట్రావిస్ హెడ్ గట్టిగా బదులిస్తూ.. "మిత్రమా! నేను బౌలింగ్ చేయడానికి రాకముందే నువ్వు అవుట్ అయిపోయావు," అని ఎద్దేవా చేశాడని తెలుస్తోంది. ఈ కౌంటర్ కోహ్లీకి తీవ్ర ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం.
(PTI)expand-iconView Photos in a new improved layout
Published on May 23, 2026 10:43 AM

కోహ్లీ అవుట్ కాగానే ట్రావిస్ హెడ్ గట్టిగా బదులిస్తూ.. "మిత్రమా! నేను బౌలింగ్ చేయడానికి రాకముందే నువ్వు అవుట్ అయిపోయావు," అని ఎద్దేవా చేశాడని తెలుస్తోంది. ఈ కౌంటర్ కోహ్లీకి తీవ్ర ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం.

(PTI)

4/5

ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఈ ఘటనపై స్పందించాడు. "మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆవేశంలో అలా మాట్లాడటం సహజం, దానిని వదిలేయవచ్చు. కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఆ కోపాన్ని మనసులో ఉంచుకుని ప్రవర్తించిన తీరు (షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడం) ఏమాత్రం సరైనది కాదు," అని పఠాన్ అభిప్రాయపడ్డాడు.
expand-iconView Photos in a new improved layout
Published on May 23, 2026 10:43 AM

ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఈ ఘటనపై స్పందించాడు. "మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆవేశంలో అలా మాట్లాడటం సహజం, దానిని వదిలేయవచ్చు. కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఆ కోపాన్ని మనసులో ఉంచుకుని ప్రవర్తించిన తీరు (షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడం) ఏమాత్రం సరైనది కాదు," అని పఠాన్ అభిప్రాయపడ్డాడు.

5/5

అయితే ట్రావిస్ హెడ్ కూడా గతంలో 2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సమయంలో భారత్‌పై తీవ్రంగా స్లెడ్జింగ్‌కు దిగిన రికార్డు ఉంది. మైదానంలో కోహ్లీ అగ్రెసివ్‌గా ఉంటాడనే విషయం అందరికీ తెలిసిందే అయినా, ఈ ఘటనలో ప్రస్తుతానికైతే కోహ్లీదే తప్పు అన్నట్లుగా విమర్శలు వస్తున్నాయి.

Related Photos