Samarlakota Fire accident : సామర్లకోటలో భారీ పేలుడు - పెరుగుతున్న మృతుల సంఖ్య..! సీఎం తీవ్ర దిగ్భ్రాంతి
Samarlakota Fire accident : కాకినాడ జిల్లా సామర్లకోటలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 నుంచి 20 మధ్య కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
కాకినాడ జిల్లా సామర్లకోటలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 నుంచి 20 మధ్య కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించింది.
ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 34 మంది పనిచేస్తున్నారు. వీరిలో 15 నుంచి 20 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ పేలుడు జరిగినప్పుడు ఐదు గ్రామాల పరిధిలో దట్టమైన పొగలు అలముకున్నాయి. పేలుడు సంభవించే ప్రాంతానికి స్థానికులు చేరుకున్నప్పటికే అందులో చిక్కుకున్న పలువురు అగ్నికి ఆహుతయ్యారు. ఘటనాస్థలిలో శరీరభాగాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి.
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకుంటామని హామీనిచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఘటనాస్థలికి వచ్చారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు.క్షతగాత్రులను అంబులెన్స్ సహాయంతో కాకినాడ జీజీహెచ్ కు తరలించినట్లు ప్రకటించారు.
ప్రాథమిక విచారణ ప్రకారం… బాణసంచా తయారీలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం లేదా రసాయనాల మిశ్రమంలో జరిగిన పొరపాటు వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ తయారీ కేంద్రానికి అనుమతులు ఉన్నాయా లేదా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “ కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటన తీవ్రంగా కలచివేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన పరిహారం ప్రకటించి అండగా నిలవాలి. గాయపడిన వారికి వెంటనే మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా” అని ట్వీట్ చేశారు.
E-Paper

