Fake visa scam : వీసా దొరికిందని టికెట్​ తీసుకుని ఎయిర్​పోర్ట్​కి వెళతారు.. కానీ అవి ఫేక్​ అని తెలిస్తే?

మెరుగైన జీవితం కోసం విదేశాలకు వెళ్లాలనుకున్న ఒక సామాన్యుడి కలలు ఇమ్మిగ్రేషన్ మోసగాళ్ల చేతిలో ఛిద్రమయ్యాయి. వీసా, టికెట్ నకిలీవని తెలియడంతో ఆయన కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఇప్పుడు వైరల్​ అవుతోంది. ఇలా చాలా మంది ఇప్పుడు ‘ఫేక్​ వీసా’ స్కామ్​కి బలవుతున్నారు. అసలేం జరిగింది?

Published on: Mar 10, 2026 10:45 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

బంగ్లాదేశ్‌లోని మాణిక్‌గంజ్ జిల్లా బలియా భడ గ్రామానికి చెందిన 35 ఏళ్ల మహ్మద్ బాబుల్ హొస్సేన్ (జమాల్) వృత్తిరీత్యా టైలర్. ఒక చిన్న కుట్టు మిషన్ షాపు నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించేవాడు. భార్యాబిడ్డలకు మెరుగైన భవిష్యత్తును ఇవ్వాలనే ఉద్దేశంతో 2020 నుంచి పైసా పైసా కూడబెట్టి విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
expand-iconView Photos in a new improved layout
Published on Mar 10, 2026 10:45 AM

2/5

హొస్సేన్ విదేశీ ప్రయత్నాలు మొదటి నుంచీ మోసాల మధ్యే సాగాయి:

2021లో మొదటి మోసం: ఒక వ్యక్తికి సుమారు 2,50,000 టాకాలు (సుమారు  ₹రూ. .8 లక్షలు) చెల్లించి మోసపోయాడు.

రెండో ప్రయత్నం: సౌదీ అరేబియా వెళ్లేందుకు మరో వ్యక్తికి 50,000 టాకాలు ఇచ్చాడు, కానీ వీసా రాలేదు.

2024లో మూడో మోసం: బెలారస్ పంపిస్తామన్న ఒక ఏజెన్సీతో 7,50,000 టకాలకు ఒప్పందం చేసుకుని, వాయిదాల పద్ధతిలో 30,000 టకాలు చెల్లించాడు. అది కూడా మోసమేనని తేలింది.

3/5

ఇంత జరిగినా విదేశీ ఆశ వదులుకోని హొస్సేన్, ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా "సోహైల్" అనే వ్యక్తి పరిచయమయ్యాడు. థాయ్‌లాండ్‌లోని 'బిడి ఫుడ్' అనే కంపెనీలో నెలకు 50,000 టకాల జీతంతో ఉద్యోగం ఇప్పిస్తానని సోహైల్ నమ్మబలికాడు. ఇందుకోసం సోహైల్ చెప్పిన ఆఫ్రిది అనే వ్యక్తికి అనేక మార్గాల ద్వారా మొత్తం 3,60,000 టకాలు (సుమారు  ₹2.7 లక్షలు) పంపాడు.

4/5

ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు విమానం ఎక్కాల్సి ఉండటంతో హొస్సేన్ ఉత్సాహంగా ఢాకా విమానాశ్రయానికి చేరుకున్నాడు. తీరా లోపలికి వెళ్లాక అధికారులు తనిఖీ చేయగా.. అతని వీసా, విమానం టిక్కెట్లు, ఉద్యోగ పత్రాలన్నీ నకిలీవని తేలింది. ఆ ఒక్క మాటతో అతని ప్రపంచం ఒక్కసారిగా చీకటిమయమైంది.

5/5

"నేను షాపులోని వస్తువులన్నీ అమ్మేసి, తెలిసిన వారి దగ్గర అప్పులు చేసి ఈ డబ్బు కట్టాను. ఇప్పుడు ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదు. నేను విదేశాలకు వెళుతున్నానని ఊరంతా తెలుసు, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఇంటికి వెళ్లాలో అర్థం కావడం లేదు," అంటూ హొస్సేన్ విమానాశ్రయంలో కన్నీరుమున్నీరయ్యాడు.

Related Photos