ఆస్ట్రేలియాతో రెండో వన్డేలోనూ టీమిండియా ఓడిపోవడానికి 5 ప్రధాన కారణాలు ఇవే..

By Hari Prasad S, Hyderabad
Published on Oct 23, 2025 07:30 pm IST

అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ టీమిండియా 2 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమితో భారత్ మూడు వన్డేల సిరీస్ ను కూడా కోల్పోయింది. భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ (73) నిలిచాడు. అయితే ఈ ఓటమికి 5 కారణాలేంటో తెలుసుకోండి.

1 / 5

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి రెండో వన్డేలోనూ డకౌట్ అయ్యాడు. తొలి వన్డేలో 8 బంతులు ఆడగా.. రెండో వన్డేలో 4 బంతులకే డకౌటై వెనుదిరిగాడు.
(AP) expand-icon View Photos in a new improved layout
Published on Oct 23, 2025 07:30 pm IST

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి రెండో వన్డేలోనూ డకౌట్ అయ్యాడు. తొలి వన్డేలో 8 బంతులు ఆడగా.. రెండో వన్డేలో 4 బంతులకే డకౌటై వెనుదిరిగాడు.

(AP)

2 / 5

టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రదర్శన కూడా చాలా పేలవంగా ఉంది. టెస్టుల్లో కెప్టెన్ గా బలమైన ఆరంభం చేసిన గిల్ వన్డేల్లో తన ఫామ్ అందుకోలేకపోతున్నాడు. పెర్త్ లో జరిగిన మ్యాచ్ లో గిల్ 18 బంతుల్లో 10 పరుగులు, అడిలైడ్ లో 9 బంతుల్లో 9 పరుగులు చేశాడు.
(AP) expand-icon View Photos in a new improved layout
Published on Oct 23, 2025 07:30 pm IST

టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రదర్శన కూడా చాలా పేలవంగా ఉంది. టెస్టుల్లో కెప్టెన్ గా బలమైన ఆరంభం చేసిన గిల్ వన్డేల్లో తన ఫామ్ అందుకోలేకపోతున్నాడు. పెర్త్ లో జరిగిన మ్యాచ్ లో గిల్ 18 బంతుల్లో 10 పరుగులు, అడిలైడ్ లో 9 బంతుల్లో 9 పరుగులు చేశాడు.

(AP)

3 / 5

రెండో వన్డేలో రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో రాణించినా.. మిడిలార్డర్ లో కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి తీవ్రంగా నిరాశ పరచడం కూడా ఓటమికి కారణాల్లో ఒకటిగా చెప్పొచ్చు.
(AP) expand-icon View Photos in a new improved layout
Published on Oct 23, 2025 07:30 pm IST

రెండో వన్డేలో రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో రాణించినా.. మిడిలార్డర్ లో కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి తీవ్రంగా నిరాశ పరచడం కూడా ఓటమికి కారణాల్లో ఒకటిగా చెప్పొచ్చు.

(AP)

4 / 5

ప్రపంచంలోని టాప్ స్పిన్నర్లలో ఒకడిగా ఉన్నప్పటికీ కుల్దీప్ యాదవ్ కు చోటు దక్కడం లేదు. దీంతో స్పిన్ బౌలింగ్ బలహీనంగా మారిపోయింది. సుందర్, అక్షర్ లాంటి ఆల్ రౌండర్ల కోసం క్వాలిటీ స్పిన్నర్ ను పక్కన పెట్టి టీమిండియా తగిన మూల్యం చెల్లించుకుంటోంది.
(HT_PRINT) expand-icon View Photos in a new improved layout
Published on Oct 23, 2025 07:30 pm IST

ప్రపంచంలోని టాప్ స్పిన్నర్లలో ఒకడిగా ఉన్నప్పటికీ కుల్దీప్ యాదవ్ కు చోటు దక్కడం లేదు. దీంతో స్పిన్ బౌలింగ్ బలహీనంగా మారిపోయింది. సుందర్, అక్షర్ లాంటి ఆల్ రౌండర్ల కోసం క్వాలిటీ స్పిన్నర్ ను పక్కన పెట్టి టీమిండియా తగిన మూల్యం చెల్లించుకుంటోంది.

(HT_PRINT)

5 / 5

బుమ్రా లేని నేపథ్యంలో పేస్ బౌలింగ్ భారాన్ని మోయాల్సిన మహ్మద్ సిరాజ్ తీవ్రంగా నిరాశ పరిచాడు. రెండు మ్యాచ్ లలో కలిపి ఒకే ఒక్క వికెట్ తీశాడు. తొలి వన్డేలో 4 ఓవర్లలో 21, రెండో వన్డేలో 10 ఓవర్లలో 49 రన్స్ ఇచ్చాడు.
(AFP) expand-icon View Photos in a new improved layout
Published on Oct 23, 2025 07:30 pm IST

బుమ్రా లేని నేపథ్యంలో పేస్ బౌలింగ్ భారాన్ని మోయాల్సిన మహ్మద్ సిరాజ్ తీవ్రంగా నిరాశ పరిచాడు. రెండు మ్యాచ్ లలో కలిపి ఒకే ఒక్క వికెట్ తీశాడు. తొలి వన్డేలో 4 ఓవర్లలో 21, రెండో వన్డేలో 10 ఓవర్లలో 49 రన్స్ ఇచ్చాడు.

(AFP)

• author-default-90x90
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!