వరద నీటితో రోగాల ముప్పు- ఏ వ్యాధులు వస్తాయి? ప్రాణ రక్షణకు పాటించాల్సిన 5 సూత్రాలు..

వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో వర్షపు నీటి వల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉంది. నీటి ద్వారా వచ్చే వ్యాధులు, వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్య రక్షణకు పాటించాల్సిన 5 ముఖ్యమైన నిబంధనలను ఈ కథనంలో తెలుసుకోండి..

Published on: Aug 28, 2026 12:18 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

గోదావరి, కృష్ణానది ఉప్పొంగినా లేదా వర్షాకాలంలో హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో వీధులు జలమయమైనా.. ముంపు ప్రాంతాల ప్రజలకు తక్షణమే ఎదురయ్యే అతిపెద్ద సవాలు వ్యాధుల వ్యాప్తి! వరద నీరు కేవలం శుభ్రమైన వర్షపు నీరు మాత్రమే అనుకుంటే పొరపాటే. అది వీధులు, మురికి కాల్వలు, డ్రైనేజీలు, పొలాల గుండా ప్రవహిస్తూ కొట్టుకువస్తుంది. దానితో మానవ, జంతు వ్యర్థాలు, రసాయనాలు, హానికర బ్యాక్టీరియా ఈ నీటిలో కలుస్తాయి. మన దగ్గర వరదలు వచ్చిన ప్రతిసారి విరేచనాలు, చర్మవ్యాధులు, జ్వరాల కేసులు విపరీతంగా పెరగడానికి ప్రధాన కారణం ఇదే.
expand-iconView Photos in a new improved layout
Published on Aug 28, 2026 12:18 PM

2/5

వరద నీటి వల్ల వ్యాపించే ప్రధాన ఇన్ఫెక్షన్లు- కలుషిత నీరు లేదా ఆహారం తీసుకోవడం వల్ల వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు వస్తాయి. చిన్నారులు, వయోధికులలో ఇది త్వరితగతిన డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. పారిశుధ్య లోపం, కలుషిత ఆహారం ద్వారా బ్యాక్టీరియా శరీరంలోకి చేరి తీవ్రమైన జ్వరానికి కారణమవుతుంది. కలుషితమైన తాగునీరు ద్వారా కాలేయానికి సోకే ఇన్ఫెక్షన్ ఇది. మురికి నీటిలో ఎక్కువ సేపు నడవడం వల్ల చర్మం అలర్జీకి గురవుతుంది. గాయాలు, కోత ఉన్న చోట ఇన్ఫెక్షన్లు మరింత త్వరగా వ్యాపిస్తాయి. వ్యర్థాలు లేదా జంతువుల మూత్రం కలిసిన నీటి ద్వారా ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది.

3/5

ప్రాణరక్షణకు కీలక సూత్రాలు- అత్యవసర పరిస్థితుల్లో తప్ప వరద ప్రవాహంలో నడవడం, ఈత కొట్టడం లేదా వాహనాలు నడపడం చేయకూడదు. నీటి అడుగున విద్యుత్ వైర్లు, గుంతలు, పదునైన వస్తువులు ఉండే ప్రమాదం ఉంది. తప్పనిసరిగా నీటిలోకి వెళ్లాల్సి వస్తే వాటర్‌ప్రూఫ్ బూట్లు, రక్షణ దుస్తులు ధరించాలి. పిల్లలను వరద నీటికి దూరంగా ఉంచాలి. ఆహారం తినేముందు, వండేముందు, టాయిలెట్‌కు వెళ్లొచ్చిన తర్వాత చేతులను సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు శుభ్రంగా కడుక్కోవాలి. సబ్బు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ వాడాలి.

4/5

వరదలు తగ్గే వరకు కుళాయి నీరు లేదా బావి నీటిని నేరుగా తాగకూడదు. నీటిని కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా మరిగించి చల్లారిన తర్వాతే తాగాలి. ఆహార పదార్థాలు వండేందుకు, పళ్లు తోముకునేందుకు కూడా పరిశుభ్రమైన నీటినే వాడాలి. వరద నీరు సోకిన ఆహార పదార్థాలను వెంటనే పారవేయాలి. అదే సమయంలో శరీరంపై చిన్న గాయం ఉన్నా సరే, కలుషిత నీరు తగిలితే ప్రమాదకరంగా మారుతుంది. గాయాన్ని శుభ్రమైన నీరు, సోప్‌తో శుభ్రం చేసి బ్యాండేజ్ వేయాలి. గాయం వద్ద వాపు, నొప్పి లేదా చీము పడితే వెంటనే వైద్యుడిని సంప్రదించి టెటానస్ ఇంజెక్షన్ (టీటీ) తీసుకోవాలి.

5/5

ముంపు ప్రాంతాల్లో ఉన్నవారు జ్వరం, వాంతులు, తీవ్రమైన కడుపునొప్పి, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్​సీ) లేదా డాక్టర్‌ను సంప్రదించాలి. ప్రభుత్వ ఆరోగ్య శాఖ జారీ చేసే హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.

Related Photos