Virat Kohli : క్రికెట్లోనే కాదు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లోనూ కోహ్లీ 'కింగే'!
మైదానంలో తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను వణికించే విరాట్ కోహ్లీ.. మైదానం బయట, రియల్ ఎస్టేట్ రంగంలోనూ అదే జోరు చూపిస్తున్నారు. తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి భారత రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో వ్యూహాత్మక పెట్టుబడులు పెడుతూ వార్తల్లో నిలుస్తున్నారు.
ఈ నెల ప్రారంభంలో కోహ్లీ-అనుష్క జంట అలీబాగ్‌లో రెండో ఆస్తిని కొనుగోలు చేశారు. రాయ్‌గఢ్ జిల్లాలోని ప్రముఖ 'ఆవాస్ బీచ్' సమీపంలో ఉన్న జిరాడ్ గ్రామంలో సుమారు 5 ఎకరాలకు పైగా భూమిని రూ. 37.86 కోట్లకు దక్కించుకున్నారు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డేటా సంస్థ 'సీఆర్ఈ మాట్రిక్స్' ద్వారా సేకరించిన పత్రాల ప్రకారం, సుమారు 21,010 చదరపు మీటర్ల విస్తీర్ణమున్న రెండు పక్కపక్క ప్లాట్లను జనవరి 13, 2026న రిజిస్టర్ చేశారు.
(AFP)
ఈ భారీ డీల్ కోసం కోహ్లీ దంపతులు రూ. 2.27 కోట్ల స్టాంప్ డ్యూటీతో పాటు రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. రిజిస్ట్రేషన్ రికార్డుల ప్రకారం, మొదటి ప్లాట్ 14,740 చదరపు మీటర్లు కాగా, రెండో ప్లాట్ 6,270 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. మొత్తం కలిపి 21,010 చదరపు మీటర్ల భూమిని వారు సొంతం చేసుకున్నారు.
(AP)
నిజానికి అలీబాగ్‌లో కోహ్లీకి ఇది రెండో పెట్టుబడి. నాలుగేళ్ల క్రితం, అంటే 2022లో ఇదే ప్రాంతంలో 8 ఎకరాల ప్లాట్‌ను సుమారు రూ. 19 కోట్లకు కొనుగోలు చేసి అప్పట్లో వార్తల్లో నిలిచాడు. ఆ స్థలంలో దంపతులు ఇప్పటికే ఒక అద్భుతమైన విల్లాను నిర్మించుకున్నారు. ఇందులో టెంపరేచర్-కంట్రోల్డ్ పూల్, ప్రత్యేకంగా ఆర్డర్‌పై తయారు చేసిన కిచెన్, నాలుగు బాత్‌రూమ్‌లు, విశాలమైన గార్డెన్, కవర్డ్ పార్కింగ్, సిబ్బంది కోసం ప్రత్యేక గదులు వంటి అన్ని రకాల విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి.
(PTI)
కోహ్లీకి ఉన్న అత్యంత విలువైన ఆస్తుల్లో ముంబైలోని పోష్ ఏరియా 'వర్లీ'లో ఉన్న సీ-ఫేసింగ్ లగ్జరీ అపార్ట్‌మెంట్ ఒకటి. 2016లో దీనిని రూ. 34 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. 35వ అంతస్తులో ఉన్న ఈ 4-బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్ 7,171 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. అయితే, కొన్ని మీడియా కథనాల ప్రకారం తర్వాత ఈ ఫ్లాట్ బుకింగ్‌ను ఆయన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
(PTI)
పశ్చిమ దిల్లీలో పెరిగిన కోహ్లీకి గురుగ్రామ్‌లోని అత్యంత ఖరీదైన 'డీఎల్ఎఫ్ ఫేజ్ 1'లో ఒక భారీ ఇల్లు ఉంది. 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటి విలువ దాదాపు రూ. 80 కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్, అత్యాధునిక జిమ్ వంటి సౌకర్యాలు ఉన్నట్లు హిందుస్థాన్ టైమ్స్ నివేదిక పేర్కొంది.
(PTI)
E-Paper

