Gold price today : మళ్లీ పెరిగిన బంగారం ధర- తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా..
నవంబర్ 21, శుక్రవారం దేశంలో బంగారం ధరలు పెరిగాయి! దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 600 పెరిగి రూ. 1,24,530కి చేరింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, వైజాగ్, విజయవాడ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబాద్లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,14,040గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 1,24,400గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,88,900గా ఉంది.
విజయవాడలో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,14,070 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ప్రైజ్ రూ. 1,24,430గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,88,900గా ఉంది.
ఇక విశాఖపట్నంలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1,14,080గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,24,440ను ఉంది. 100 గ్రాముల సిల్వర్ రేటు రూ. 18,890 ఉంది.
బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 1,14,000- రూ. 1,24,360గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 17,590గాను.. కేజీ వెండి రేటు రూ. 1,75,900గాను కొనసాగుతున్నాయి.
ఇక చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1,15,100గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,25,560గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్ రేటు రూ. 18,690 ఉంది.
E-Paper

