Gold price today : స్థిరంగా బంగారం, వెండి ధరలు- తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా..
నవంబర్ 3, సోమవారం దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి! దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,23,260కి చేరింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, వైజాగ్, విజయవాడ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబాద్లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,12,900గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 1,23,150గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,67,000గా ఉంది.
విజయవాడలో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,12,930 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ప్రైజ్ రూ. 1,23,180గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,67,000గా ఉంది.
ఇక విశాఖపట్నంలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1,12,940గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,23,190ను ఉంది. 100 గ్రాముల సిల్వర్ రేటు రూ. 16,700 ఉంది.
బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 1,12,860- రూ. 1,23,110గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 16,200గాను.. కేజీ వెండి రేటు రూ. 1,62,000గాను కొనసాగుతున్నాయి.
ఇక చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1,13,210గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,23,490గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్ రేటు రూ. 16,500 ఉంది.
E-Paper

