Gold rate today : మళ్లీ షాక్ ఇచ్చిన పసిడి! తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన బంగారం ధరలు..
గత కొన్ని రోజులుగా పతనమవుతున్న బంగారం ధరలు.. అక్టోబర్ 26, ఆదివారం భారీగా పెరిగాయి! దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1260 పెరిగి రూ. 1,25,793కి చేరింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, వైజాగ్, విజయవాడ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబాద్లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,15,179 ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 1,25,649గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,73,300గా ఉంది.
విజయవాడలో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,15,185 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ప్రైజ్ రూ. 1,25,655గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,74,100గా ఉంది.
ఇక విశాఖపట్నంలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1,15,187గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,25,657ను ఉంది. 100 గ్రాముల సిల్వర్ రేటు రూ. 17,170 ఉంది.
బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 1,15,165- రూ. 1,25,635గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 15,910గాను.. కేజీ వెండి రేటు రూ. 1,59,100గాను కొనసాగుతున్నాయి.
ఇక చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1,15,021గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,25,471గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్ రేటు రూ. 17,270 ఉంది.
E-Paper

