Gold price : ఇండియాలో రూ. 3లక్షలు తాకనున్న 10 గ్రాముల బంగారం ధర?

గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉందని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ సంస్థ 'జెఫరీస్' అంచనా వేసింది. అమెరికా ఆర్థిక సంక్షోభం, బాండ్ ఈల్డ్స్ ఒత్తిళ్ల కారణంగా ఔన్సు బంగారం ధర 10,000 డాలర్లకు పెరిగితే, భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 3.38 లక్షలు దాటుతుందని వివరించింది.

Published on: Sept 22, 2026 11:20 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

పసిడి ప్రియులకు, ఇన్వెస్టర్లకు అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషకులు ఒక సంచలన వార్తను మోసుకొచ్చారు. రాబోయే రోజుల్లో పసిడి ధరలు ఊహించని రీతిలో ఆకాశాన్ని తాకే అవకాశం ఉందని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ జెఫరీస్ అంచనా వేసింది. ఇప్పటికే దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర రూ. 1,50,000 దాటి ప్రయాణిస్తూ, రూ. 1,42,000, రూ. 1,35,000 వద్ద బలమైన సపోర్ట్ బేస్‌ను ఏర్పరుచుకుంది. పండుగ సీజన్ డిమాండ్‌తో పాటు అంతర్జాతీయ భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు పసిడి పరుగుకు మరింత ఊతాన్ని ఇస్తున్నాయి.
expand-iconView Photos in a new improved layout
Published on Sept 22, 2026 11:20 AM

2/5

జెఫరీస్ ఈక్విటీ రీసెర్చ్ విభాగాధిపతి క్రిస్ వుడ్ బంగారం భవిష్యత్తుపై తీవ్ర బుల్లిష్‌గా  ఉన్నారు. దీర్ఘకాలంలో అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్సు పసిడి ధర ఏకంగా 10,000 డాలర్లకు చేరుకుంటుందని ఆయన గట్టిగా విశ్వసిస్తున్నారు. "అమెరికా, జపాన్ దేశాలు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక సంక్షోభాల వల్ల బంగారం ధర 10,000 డాలర్లకు చేరడం ముమ్మాటికీ సాధ్యమే," అని క్రిస్ వుడ్ స్పష్టం చేశారు. అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ విపరీతంగా పెరగడం వల్ల అక్కడ అప్పుల భారం మరింత పెరుగుతుందని, దీనిని నియంత్రించేందుకు అమెరికా ప్రభుత్వం బాండ్ ఈల్డ్స్‌పై పరిమితులు విధించక తప్పదని ఆయన విశ్లేషించారు.

3/5

అమెరికా బాండ్ ఈల్డ్స్‌ను 5% నుంచి 6% మధ్య నిలబెట్టేందుకు ఆ దేశ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ప్రయత్నిస్తున్న సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయని క్రిస్ వుడ్ పేర్కొన్నారు. ఒకవేళ ఈ మార్కెట్ ప్రయత్నాలు విఫలమైతే, అమెరికా ప్రభుత్వం బాండ్ ఈల్డ్స్‌ను అధికారికంగా ఫిక్స్ చేయాల్సి వస్తుంది. అమెరికా ట్రెజరీ బాండ్ల ధరలను ప్రభుత్వం నియంత్రించడం ప్రారంభించగానే డాలర్ తీవ్రంగా బలహీనపడుతుంది. ఇది భారత్ వంటి ఎమర్జింగ్ మార్కెట్లలోని ఈక్విటీలకు, పసిడికి భారీ ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. డాలర్ విలువ పడిపోతే, ఇన్వెస్టర్లు సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగా భావించే బంగారం వైపు ఎక్కువ మొత్తంలో నిధులను మళ్లిస్తారు.

4/5

క్రిస్ వుడ్ చేసిన ఈ అంచనా నిజమైతే భారతీయ ఇన్వెస్టర్లకు, సామాన్య కుటుంబాల ఆస్తుల విలువకు ఊహించని రీతిలో లబ్ధి చేకూరుతుంది. ఔన్సు పసిడి ధర 10,000 డాలర్లకు చేరితే, మన రూపాయి మారకంతో పోల్చితే తులం బంగారం ధర దాదాపు రూ. 3.38 లక్షల మార్కును దాటుతుంది. ప్రస్తుతం ఒక అమెరికన్ డాలర్ మారకం విలువ దాదాపు రూ. 96 వద్ద ఉంది. ఈ లెక్కన 10,000 డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ. 9,60,000 అవుతుంది. ఒక ఔన్సు పరిమాణం 28.35 గ్రాములకు సమానం కాబట్టి, 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 3,38,630 [(9,60,000 / 28.3495) x 10] చేరుతుందని లెక్క తేలుతోంది. ఇది భారతీయ గృహస్తుల వద్ద ఉన్న బంగారం నిధుల విలువను విపరీతంగా పెంచుతుంది.

5/5

భారతదేశంలో దసరా, దీపావళి పండుగల సీజన్ ప్రారంభం కావడంతో భౌతిక పసిడికి కొనుగోళ్లు పుంజుకుంటున్నాయి. దీనికి తోడు ముడిచమురు సరఫరాలో అనిశ్చితి, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ఆందోళనలు పసిడి రన్‌కు మరింత ఇంధనాన్ని అందిస్తున్నాయి. ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో బంగారాన్ని ఒక బలమైన రక్షణ కవచంగా మలుచుకోవడానికి ఇది సరైన సమయమని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

Related Photos