Fitbit air : గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్ లాంచ్- స్క్రీన్ లేదు, బటన్లు లేవు! హెల్త్ ట్రాకింగ్ కోసమే..

గూగుల్ తన ఫిట్‌బిట్ బ్రాండ్ కింద దాదాపు మూడేళ్ల తర్వాత 'ఫిట్‌బిట్ ఎయిర్' పేరుతో ఒక వినూత్న వేరబుల్ గ్యాడ్జెట్​ని పరిచయం చేసింది. స్మార్ట్‌వాచ్‌ లాంటి భారీ డిజైన్లకు భిన్నంగా, స్క్రీన్ లేని ఈ కాంపాక్ట్ ట్రాకర్ కేవలం ఆరోగ్యం, నిద్రను మానిటర్ చేయడంపైనే దృష్టి పెడుతుంది. వివరాల్లోకి వెళితే..

Published on: May 9, 2026 11:20 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

డిజైన్ పరంగా ఈ ఫిట్‌బిట్ ఎయిర్ చాలా విభిన్నంగా ఉంటుంది! ఇందులో ఎటువంటి డిస్‌ప్లే గానీ, బటన్లు గానీ ఉండవు. నోటిఫికేషన్లను కూడా ఇది సపోర్ట్ చేయదు. హెప్టిక్ ఫీడ్‌బ్యాక్ (వైబ్రేషన్స్) ద్వారా అలర్ట్స్ ఇస్తుంది. మొత్తం డేటాను 'గూగుల్ హెల్త్' యాప్ ద్వారా చూసుకోవచ్చు.
expand-iconView Photos in a new improved layout
Published on May 9, 2026 11:20 AM

2/5

ఇది కేవలం 12 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. గతంలో వచ్చిన ఫిట్‌బిట్ లక్స్ కంటే ఈ ఫిట్​బిట్​ ఎయిర్ 25 శాతం చిన్నదిగా ఉంటుంది. 24/7 హృదయ స్పందన రేటు, గుండె లయను పర్యవేక్షించే Afib అలర్ట్స్, SpO2 (బ్లడ్ ఆక్సిజన్), విశ్రాంతి సమయంలో హృదయ స్పందన వంటి వాటిని ట్రాక్ చేస్తుంది. నిద్ర సమయం, స్టేజెస్​ని ఇది పర్యవేక్షిస్తుంది. దీని చిన్న పరిమాణం కారణంగా రాత్రిపూట ధరించడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

3/5

ఈ గూగుల్​ ఫిట్​బిట్ ఎయిర్​ ఫిట్​నెస్​ ట్రాకర్​ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 7 రోజుల వరకు పనిచేస్తుంది. కేవలం 5 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్‌తో రోజంతా వాడుకోవచ్చు. ఇది 50 మీటర్ల వరకు వాటర్​లో మునిగినా ప్రమాదం ఉండదు. దీనిలోని 'పెబుల్' మాడ్యూల్‌ను విడదీసి మనకు నచ్చిన బ్యాండ్లకు మార్చుకోవచ్చు. బాస్కెట్‌బాల్ దిగ్గజం స్టెఫెన్ కర్రీతో కలిసి రూపొందించిన ఒక స్పెషల్ ఎడిషన్ వేరియంట్ కూడా అందుబాటులో ఉండటం విశేషం.

4/5

ఫిట్‌బిట్ ఎయిర్ ధర 99.99 డాలర్లు (సుమారు రూ. 9,500) గా నిర్ణయించారు. స్పెషల్ ఎడిషన్ ధర 129.99 డాలర్లు (సుమారు రూ. 12,300) గా ఉంది. అమెరికాలో మే 26 నుంచి ఇది విక్రయానికి రానుంది. కొనుగోలు చేసిన వారికి మూడు నెలల గూగుల్ హెల్త్ ప్రీమియం ట్రయల్ ఉచితంగా లభిస్తుంది.

5/5

ప్రస్తుతానికి భారత్‌లో ఈ పరికరం ఎప్పుడు విడుదలవుతుందనే దానిపై గూగుల్ స్పష్టత ఇవ్వలేదు. అయితే, ఇప్పటికే గూగుల్ హెల్త్ సర్వీసులు మన దేశంలో అందుబాటులోకి రావడం వల్ల, త్వరలోనే ఇది ఇక్కడ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫిట్​బిట్​ ఎయిర్ ఒకవేళ ఇండియాలో రూ. 10 వేల లోపు ధరకు వస్తే, యాపిల్, శాంసంగ్ స్మార్ట్‌వాచ్‌లకు ఇది ఒక తేలికపాటి ప్రత్యామ్నాయంగా మారుతుంది.

Related Photos