గూగుల్ మ్యాప్స్​లో సరికొత్త విప్లవం- రూట్ చూపించడమే కాదు.. హోటల్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్ కూడా!

గూగుల్ మ్యాప్స్ ఇక కేవలం దారులు చూపే యాప్ మాత్రమే కాదు! ప్రయాణాల్లో హోటల్ బుకింగ్స్, నచ్చిన వంటకాల ఆర్డర్, ఈవెంట్ల సమాచారం అందించేందుకు 'ఆస్క్ మ్యాప్స్' ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. భారతదేశం కోసం హిందీ సపోర్ట్, రియల్ టైమ్ ట్రాన్సిట్ అప్‌డేట్స్ వచ్చేశాయి.

Published on: Aug 7, 2026 11:24 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ప్రయాణాల్లో సరైన దారి తెలుసుకోవడానికి మనందరం ఎక్కువగా ఆధారపడేది ‘గూగుల్ మ్యాప్స్’ పైనే! అయితే, గూగుల్ మ్యాప్స్ ఇకపై కేవలం దారులు, ట్రాఫిక్ వివరాలు చూపించడానికే పరిమితం కావడం లేదు. మీ ప్రయాణ అనుభవాన్ని, భోజన ప్రణాళికలను పూర్తిగా మార్చేసేలా సరికొత్త కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో కూడిన ఫీచర్లను గూగుల్ ఇందులో పరిచయం చేసింది. ఇకపై మీరు రోడ్డుపైకి వెళ్లకముందే మీ ఫుడ్ ఆర్డర్ చేయడం నుంచి హోటల్ రూమ్స్ బుక్ చేయడం వరకు అనేక పనులను గూగుల్ మ్యాప్స్ సులభతరం చేసేస్తుంది.
expand-iconView Photos in a new improved layout
Published on Aug 7, 2026 11:24 AM

2/5

ఉదాహరణకు, మీరు విదేశాల్లో లేదా మరేదైనా కొత్త ప్రదేశంలో పర్యటిస్తున్నప్పుడు మీకు అకస్మాత్తుగా బటర్ చికెన్ లేదా చోలే భటూరే తినాలనిపించిందనుకోండి. దానితో ఒక్కో రెస్టారెంట్ కోసం గంటల తరబడి వెతకాల్సిన అవసరం లేదు. నేరుగా గూగుల్ మ్యాప్స్‌ వాడుకోవచ్చు. 'ఆస్క్ మ్యాప్స్' (Ask Maps) లో మిమ్మల్ని ఏం కావాలో అడగమని కోరుతుంది. మీరు వెళ్లే మార్గంలో మీ అభిరుచులు, ఆహార నియమాలు, మీరు ఇదివరకు సేవ్ చేసుకున్న ప్రదేశాల ఆధారంగా బెస్ట్ రెస్టారెంట్లను ఇది సూచిస్తుంది. మీరు ఎంచుకున్న ఆహారాన్ని నేరుగా కార్ట్‌కి చేర్చే వెసులుబాటును కూడా ఈ ఫీచర్ అందిస్తుంది.

3/5

హోటల్ బుకింగ్‌ల విషయంలోనూ ఇది అంతే సమర్థవంతంగా పనిచేస్తుంది. పది రకాల ఫిల్టర్లు ఎంచుకునే పనిలేకుండా.. "విశాలమైన గదులు ఉండి, తక్కువ ధరలో దొరికే ఫ్యామిలీ హోటల్ చూపించు," అని అడిగితే చాలు. గూగుల్ మ్యాప్స్ ప్రత్యక్ష ధరలు, గదుల లభ్యతను తనిఖీ చేసి మీకు సరైన ఆప్షన్లను ముందే ఉంచుతుంది. ఇది మాత్రమే కాదు, మీరు బస చేసే ప్రదేశం చుట్టుపక్కల జరిగే సంగీత కచేరీలు, పండుగలు, స్థానిక పర్యాటక ప్రాంతాల వివరాలను టికెట్ బుకింగ్ లింకులతో సహా ఆస్క్ మ్యాప్స్ అందిస్తుంది. ఈ అధునాతన ఏఐ ఫీచర్లు ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఇండోనేషియా, జపాన్, మెక్సికోలతో సహా 150కి పైగా దేశాలు, ప్రాంతాల్లో అందుబాటులోకి వస్తున్నాయి.

4/5

భారతీయ వినియోగదారుల కోసం గూగుల్ కొన్ని ప్రత్యేకమైన, అత్యంత ఉపయోగకరమైన అప్‌డేట్లను అందుబాటులోకి తెచ్చింది. ఇంగ్లీషుతో పాటు ఇప్పుడు హిందీ భాషలో కూడా గూగుల్ మ్యాప్స్‌ను ప్రశ్నలు అడగవచ్చు. రెస్టారెంట్లు, పర్యాటక ప్రాంతాల కోసం హిందీలోనే సమాధానాలు పొందవచ్చు. మీ ఎక్స్​పీరియెన్స్​తో మీ జిమెయిల్ లాంటి గూగుల్ సేవల నుంచి విమాన ప్రయాణాలు, హోటల్ రిజర్వేషన్ల వివరాలను తీసుకుని, మీ పర్యటనకు తగిన రీతిలో ప్రణాళికలను మ్యాప్స్ సూచిస్తుంది.

5/5

బస్సులు, మెట్రో రైళ్లు, సాధారణ రైళ్లు, ఫెర్రీల సమయాలు, ప్రత్యక్ష రాకపోకల సమాచారాన్ని గూగుల్ మ్యాప్స్ ఎప్పటికప్పుడు అందిస్తుంది. ప్రారంభంలో కేవలం నావిగేషన్ యాప్‌గా ప్రయాణాన్ని సులభతరం చేసిన గూగుల్ మ్యాప్స్, ఇప్పుడు పర్యటనలకు సంబంధించిన చిన్న చిన్న పనులన్నింటినీ చక్కబెట్టే పూర్తి స్థాయి పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్‌గా మారుతోంది.

Related Photos