అరిటాకులో భోజనం ఎందుకు పెడతారా తెలుసా?

దక్షిణ భారతదేశంలో పెళ్లిళ్లు, పండుగల వేళ అరిటాకులో భోజనం వడ్డించడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. అయితే ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు, దీని వెనుక అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ పళనియప్పన్ మాణిక్యం వివరించారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 20, 2026 4:30 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

అరటి ఆకుపై వేడి ఆహారం వడ్డించినప్పుడు జరిగే రసాయన ప్రక్రియను డాక్టర్ పళనియప్పన్ మాణిక్యం (డా. పాల్) ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విపులంగా వివరించారు. “మీరు అరటి ఆకులో భోజనం చేసినప్పుడు, ఆకు ఉపరితలంపై ఉండే ఏజీ, సీజీ, క్యాటెచిన్స్, గాలిక్ యాసిడ్ వంటి కొన్ని పాలీఫెనాల్స్ స్వల్ప పరిమాణంలో మీ ఆహారంలోకి చేరుతాయి. ఇది ఎందుకు అంత ముఖ్యం? నిద్రలేమి, పీచు పదార్థం తక్కువగా ఉన్న ఆహారం, అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల మన శరీరంలోని అణువులు ప్రతిరోజూ ఆక్సిడైజ్ చెందుతాయి. వీటినే మనం రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అంటాము. ఇవి శరీరంలో సూక్ష్మ స్థాయి నష్టాన్ని కలిగిస్తాయి; ఇదే ఇన్సులిన్ నిరోధకతకు ప్రధాన కారణమవుతుంది. తద్వారా ఊబకాయం, ఫ్యాటీ లివర్, మధుమేహం (డయాబెటిస్), అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ ఆక్సీకరణ ప్రక్రియతో పోరాడాలంటే మనకు యాంటీఆక్సిడెంట్లు అనే రసాయనాలు కావాలి; వీటిని మనం ఆహారం ద్వారా తీసుకోవచ్చు. అత్యంత శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లలో పాలీఫెనాల్స్ ఒకటి,” అని డాక్టర్ పళనియప్పన్ మాణిక్యం వివరించారు.

Published on Nov 20, 2026 4:30 PM

2/5

వేడివేడి అన్నం, కూరలు అరిటాకుపై పడినప్పుడు ఆ వేడికి ఆకుపై ఉండే సహజమైన మైనపు పొర కరిగి, అందులోని పాలీఫెనాల్స్ ఆహారంతో కలుస్తాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను అడ్డుకుని కణాలు దెబ్బతినకుండా కాపాడుతాయి. ఫలితంగా జీవక్రియ మెరుగుపడి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు తగ్గుతుంది.

3/5

నేటి తరం పిల్లలు నాలుగు గోడల మధ్య మొబైల్ ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతున్న తీరుపై డాక్టర్ మాణిక్యం ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు ఆరుబయట ఎక్కువ సమయం గడిపేలా, ప్రకృతితో మమేకమయ్యేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. కనీసం వారానికి ఒక్కసారైనా కుటుంబ సభ్యులందరూ కలిసి అరటి ఆకులో భోజనం చేయడాన్ని ఒక ఆహ్లాదకరమైన కుటుంబ కార్యక్రమంగా మార్చుకోవాలని సూచించారు.

4/5

భోజనం చేసే సమయంలో స్మార్ట్‌ఫోన్లు, ప్లాస్టిక్ ప్లేట్లను పూర్తిగా దూరంగా ఉంచి, కుటుంబ సభ్యులతో కబుర్లు చెప్పుకుంటూ ఆహారాన్ని ఆస్వాదించాలని డాక్టర్ సలహా ఇచ్చారు. ఇలాంటి చిన్నచిన్న అలవాట్లు పిల్లల జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని డా. పాల్ పేర్కొన్నారు. స్క్రీన్ చూస్తూ తినడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదని, అదే ప్రశాంతంగా ప్రకృతి సిద్ధమైన ఆకులో తినడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు జీర్ణశక్తి మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు.

5/5

అరిటాకు భోజనంతో పాటు రోజువారీ ఆహారపు అలవాట్లలో మరో కీలక మార్పు చేసుకోవాలని డాక్టర్ పళనియప్పన్ మాణిక్యం సూచించారు. ప్రతి భోజనంతో పాటు కనీసం ఒక పండు తినడం అలవాటు చేసుకోవాలని ఆయన సిఫార్సు చేశారు. విదేశాల్లో ఉండేవారికి బెర్రీలు మంచి ఎంపిక అయితే, భారతదేశంలో నివసించే వారికి స్థానికంగా సులభంగా దొరికే జామకాయ వంటి పండ్లు అత్యుత్తమ ఎంపిక అని ఆయన స్పష్టం చేశారు. ఖరీదైన విదేశీ పండ్ల వెంట పడకుండా, మన పెరట్లో దొరికే జామకాయలో విటమిన్ స, పీచు పదార్థం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మన పూర్వీకులు పాటించిన అరటి ఆకు సంప్రదాయాన్ని మళ్లీ ఇంటికి తెచ్చుకోవడం ద్వారా, ఖర్చు లేకుండానే ఆరోగ్యకరమైన జీవనశైలిని సొంతం చేసుకోవచ్చు.

Related Photos