Hearing health : చెవుల్లో గింగురుమంటోందా? నిర్లక్షం వద్దు.. పెద్ద శబ్దాలతో శాశ్వత ముప్పు!

కచేరీలు, లౌడ్‌స్పీకర్లు లేదా హెడ్‌ఫోన్ల వల్ల చెవుల్లో వచ్చే స్వల్ప గింగురు శబ్దాన్ని తేలికగా తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ రోజులు పెద్ద శబ్దాలకు గురైతే వినికిడి శక్తి శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

Published on: Nov 26, 2026 11:33 AM IST
google-icon
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

సంగీత కచేరీలకు వెళ్లినప్పుడో, లౌడ్‌స్పీకర్ల దగ్గర నిలబడినప్పుడో, రణగొణ ధ్వనుల మధ్య ఉన్నప్పుడో చెవుల్లో సన్నగా, గింగురుమని శబ్దం వినిపించడం చాలామందికి అనుభవమే. కాసేపటికి ఆ శబ్దం తగ్గిపోవడంతో దాన్ని మర్చిపోతుంటారు. కానీ ఆ తాత్కాలిక గింగురు శబ్దం పెద్ద శబ్దాల వల్ల చెవులపై పడుతున్న ఒత్తిడికి ముందస్తు హెచ్చరిక కావచ్చని నిపుణులు చెబుతున్నారు. హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆడియాలజిస్ట్, మెడ్-ఎల్ ఇండియా డైరెక్టర్ ప్రేమ్ రంజన్ ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. పెద్ద శబ్దాలకు గురైనప్పుడు తల బరువుగా అనిపించడం, చెవుల్లో గింగురు శబ్దం రావడం, వినికిడి సున్నితత్వం తాత్కాలికంగా తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయని ఆయన వివరించారు.

Published on Nov 26, 2026 11:33 AM

2/6

“కొన్నిసార్లు తక్కువ సమయం పాటు పెద్ద శబ్దాలు విన్నప్పుడు ఈ లక్షణాలు కాసేపే ఉంటాయి. అయితే చాలా రోజులు, వారాల తరబడి ఇలాంటి శబ్దాలకు గురైతే వాటి దుష్ప్రభావాలు శాశ్వతంగా మారే ప్రమాదం ఉంది,” అని ఆయన అన్నారు. “మన లోపలి చెవిలో వేలాది సూక్ష్మ వెంట్రుక కణాలు ఉంటాయి. ఇవి శబ్ద తరంగాలను మెదడు అర్థం చేసుకునే విద్యుత్ సంకేతాలుగా మారుస్తాయి. ఈ కణాలు చాలా సున్నితమైనవి; అధిక శబ్దాల వల్ల ఒకసారి దెబ్బతింటే తిరిగి పెరగవు,” అని ప్రేమ్ రంజన్ వెల్లడించారు.

3/6

వినికిడి శక్తి దెబ్బతినే ప్రక్రియ ఎలాంటి స్పష్టమైన హెచ్చరికలు లేకుండానే సాగడం ఆందోళన కలిగించే అంశం! నొప్పి గానీ, వెంటనే గాయపడినట్లు గానీ అనిపించకపోవచ్చు. బదులుగా వినికిడి ఇబ్బందులు క్రమంగా బయటపడతాయి; ఇతరులు చెప్పే మాటలను అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడటం, మళ్లీ చెప్పమని అడగడం వంటివి కనిపిస్తాయి. కచేరీలు, సామాజిక వేడుకలు, పని ప్రదేశాలు లేదా వ్యక్తిగత ఆడియో పరికరాల ద్వారా నిరంతరం పెద్ద శబ్దాలకు గురైతే వినికిడి ముప్పు పెరుగుతుంది. శబ్ద స్థాయిలపై దృష్టి పెట్టి, వాటికి దూరంగా ఉండటం ద్వారా వినికిడిని కాపాడుకోవచ్చు.

4/6

అధిక శబ్దాల బారి నుంచి తప్పించుకోవడానికి కొన్ని సాధారణ జాగ్రత్తలు పాటించాలని ప్రేమ్ రంజన్ సూచించారు. “లౌడ్‌స్పీకర్లు, ఇతర తీవ్రమైన శబ్ద వనరులకు సురక్షిత దూరంలో ఉండండి. కచేరీలకు వెళ్లినప్పుడు లేదా శబ్దాలు ఎక్కువగా ఉండే చోట ఉన్నప్పుడు ఇయర్‌ప్లగ్స్ వెంట ఉంచుకోండి. కొన్ని నిమిషాల పాటు ప్రశాంతమైన చోటుకు వెళ్లి క్రమం తప్పకుండా విరామం తీసుకోవచ్చు,” అని ఆయన సలహా ఇచ్చారు. హెడ్‌ఫోన్లు వాడేవారు వాల్యూమ్ స్థాయి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ హెడ్‌ఫోన్‌లో ప్లే అవుతున్న సంగీతం పక్కనున్న వారికి వినిపిస్తుంటే, వాల్యూమ్ చాలా ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. పిల్లలకు అదనపు రక్షణ అవసరం! ఎందుకంటే పెద్ద శబ్దాలు వారిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. తల్లిదండ్రులు పిల్లలను శబ్దాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు తీసుకెళ్లడం తగ్గించాలి, అవసరమైనప్పుడు సరిగ్గా అమరే వినికిడి రక్షణ సాధనాలను ఉపయోగించాలి

5/6

పెద్ద శబ్దాల తర్వాత చెవుల్లో తాత్కాలికంగా గింగురుమనడం లేదా చెవులు మూసుకుపోయినట్లు అనిపించడం వంటివి తగ్గకుండా కొనసాగితే నిర్లక్ష్యం చేయకూడదు. “చెవుల్లో గింగురు శబ్దం లేదా మూసుకుపోయిన భావన అలాగే ఉంటే, దానంతట అదే తగ్గిపోతుందని వేచి చూడకుండా ఆడియాలజిస్ట్‌ను లేదా ఈఎన్‌టీ నిపుణుడిని సంప్రదించండి,” అని రంజన్ సూచించారు.

వినికిడి ఆరోగ్యాన్ని అర్థం చేసుకోవడానికి ఆన్‌లైన్ హియరింగ్ స్క్రీనింగ్ ఒక సులభమైన తొలి అడుగుగా ఉపయోగపడుతుంది. అయితే నిపుణులైన వైద్యుడితో సమగ్ర పరీక్ష చేయించుకోవడానికి ఇది ప్రత్యామ్నాయం కాదు.

6/6

సరైన పరీక్షలు, రీహాబ్​తో వినికిడి లోపాన్ని పరిష్కరించవచ్చని రంజన్ స్పష్టం చేశారు. వినికిడి సాంకేతికతలో వచ్చిన పురోగతి వల్ల వివిధ రకాల, వివిధ స్థాయిల వినికిడి లోపం ఉన్నవారు కూడా శబ్దాలను గ్రహిస్తూ సమాజంతో మమేకం కాగలుగుతున్నారు. “నేడు కాక్లియర్ ఇంప్లాంట్లు, మిడిల్ ఇయర్ ఇంప్లాంట్లు, బోన్ కండక్షన్ సిస్టమ్స్ వంటి ఆధునిక పరిష్కారాలు వివిధ వయసుల వారికి సంభాషణలు, సంగీతం, తమకు ఇష్టమైన రోజువారీ శబ్దాలను వినడంలో తోడ్పడుతున్నాయి,” అని ఆయన తెలిపారు. మన చుట్టూ ఉన్న శబ్దాలపై అవగాహన పెంచుకోవడం, ఎక్కువ శబ్దాలకు దీర్ఘకాలం గురైతే కలిగే ముప్పును అర్థం చేసుకోవడంతో చెవుల రక్షణ మొదలవుతుంది. చిన్నపాటి జాగ్రత్తలు, సకాలంలో పరీక్షలు, తగిన పరిష్కారాల ద్వారా మన చుట్టూ ఉన్న వారితో, అనుభవాలతో అనుబంధాన్ని నిలబెట్టుకోవచ్చు.

Related Photos