వెదర్ అప్డేట్స్ : ఈనెల 17న అల్పపీడనం…! ఏపీకి వర్ష సూచన
ఓవైపు తీవ్రమైన చలి ఉండగా… వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో 17న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఏపీలోని పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది.
బంగాళాఖాతంలో ఈనెల 17న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఏపీలోని పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే పెద్దగా ప్రభావం ఉండదని… మోస్తారు వర్షాలు పడొచ్చని అంచనా వేస్తున్నారు.
అల్పపీడనం ఏర్పడితే… అది బలపడి వాయుగుండంగా మారే సూచనలు కూడా ఉన్నాయి. దీని ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి.
(image source @APSDMA)
నైరుతి మరియు దానిని అనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోందని పేర్కొంది.
అమరావతి వాతావరణ ఇవాళ్టి బులెటిన్ ప్రకారం... ఇవాళ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు లేదా జల్లులు కురిసే అవకాశం ఉంది. అయితే ఎలాంటి హెచ్చరికలు లేవు.
రేపు, ఎల్లుండి ఏపీలో పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. చలి తీవ్రత కొనసాగుతోందని అంచనా వేసింది.
రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోందని… ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులు సూచిస్తున్నారు.
E-Paper

