...
...
Next Story

ఓటీటీలోకి ఎల్లుండే తెలుగు రొమాంటిక్ హారర్ థ్రిల్లర్.. ప్రెస్ మీట్‌లో హీరోయిన్ రీతు వర్మ గ్లామర్ ఫొటోలు!

ఓటీటీలోకి రెండ్రోజుల్లో తెలుగు రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దేవిక అండ్ డానీ స్ట్రీమింగ్ కానుంది. జూన్ 6 నుంచి దేవిక అండ్ డానీ ఓటీటీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో జూన్ 3న ప్రెస్ మీట్ నిర్వహించారు. దేవిక అండ్ డానీ ప్రెస్ మీట్‌లో చీరలో దర్శనమిచ్చిన హీరోయిన్ రీతు వర్మ గ్లామర్ ఫొటోలపై లుక్కేద్దాం.

Published on: Jun 4, 2025, 17:02:17 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement
<p>టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్‌లలో రీతు వర్మ ఒకరు. విజయ్ దేవరకొండ నటించిన పెళ్లి చూపులు సినిమాతో హీరోయిన్‌గా క్రేజ్ అందుకుంది రీతు వర్మ.</p>

టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్‌లలో రీతు వర్మ ఒకరు. విజయ్ దేవరకొండ నటించిన పెళ్లి చూపులు సినిమాతో హీరోయిన్‌గా క్రేజ్ అందుకుంది రీతు వర్మ.

పెళ్లి చూపులు తర్వాత వరుడు కావలెను, టక్ జగదీశ్, స్వాగ్ వంటి సినిమాలతో అలరించింది. ఇటీవల సందీప్ కిషన్ మజాకా మూవీతో థియేటర్లలో సందడి చేసింది ముద్దుగుమ్మ రీతు వర్మ.

ఇప్పుడు రీతు వర్మ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. రీతు వర్మ డైరెక్ట్ ఓటీటీ కోసం నటించిన వెబ్ సిరీస్ దేవిక అండ్ డానీ. సూపర్ నేచురల్ హారర్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ జోనర్‌లో దేవిక అండ్ డానీ వెబ్ సిరీస్‌ను చిత్రీకరించారు.

బి.కిషోర్ ద‌ర్శ‌క‌త్వం వహించిన దేవిక అండ్ డానీ ఓటీటీ వెబ్ సిరీస్‌లో రీతు వర్మ హీరోయిన్‌గా సూర్య వశిష్ట, శివ కందుకూరి హీరోలుగా సుబ్బరాజు ప్రధాన పాత్ర పోషించారు. వీరితోపాటు కోవై సరళ, సోనియా సింగ్, గోకరాజు రమణ, శివన్నారాయణ, వివా హర్ష, షణ్ముఖ్, అభినయ శ్రీ, మౌనికా రెడ్డి, ఈశ్వర్య వుల్లింగల తదితరులు కీలక పాత్రలు చేశారు.

దేవిక అండ్ డానీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అది కూడా ఎల్లుండే (జూన్ 6) అంటే రెండ్రోజుల్లో ఈ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను అలరించునుంది. జూన్ 6న జియో హాట్‌స్టార్‌లో దేవిక అండ్ డానీ ఓటీటీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్.

దేవిక అండ్ డానీ ఓటీటీ రిలీజ్ ప్రెస్ మీట్‌లో చీర కట్టులో దర్శనం ఇచ్చింది హీరోయిన్ రీతు వర్మ. నీలి రంగు చీరలో ఎంతో అందంగా మెరిసిన రీతు వర్మ గ్లామర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ కార్యక్రమంలో అందంతోనే కాకుండా తన స్పీచ్‌తో కూడా అట్రాక్ట్ చేసింది హీరోయిన్ రీతు వర్మ. అనంతరం ఫొటోగ్రాఫర్స్‌కు పోజులు ఇచ్చిన రీతు వర్మ అందరి దృష్టిని ఆకర్షించింది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe