22.8 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే హైబ్రిడ్ ఎస్‌యూవీని లాంచ్ చేసిన హోండా- ఫీచర్లు..
హోండా ఇండియాలో తన కొత్త ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ 'జెడ్ఆర్-వీ ఈ:హెచ్ఈవీ'ని రూ. 47.99 లక్షల ధరతో భారత్‌లో లాంచ్ చేసింది. జపాన్ నుంచి సీబీయూ రూపంలో వస్తున్న ఈ హైబ్రిడ్ కారు ఫీచర్లు సహా ఇతర వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి ప్రముఖ జపనీస్ కార్ల తయారీ సంస్థ 'హోండా' ఒక సరికొత్త లగ్జరీ అడ్వెంచర్‌ను తీసుకొచ్చింది. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఆల్-న్యూ 'హెచ్‌ఆర్-వీ' కాన్సెప్ట్ ఆధారిత 'జెడ్ఆర్-వీ ఈ:హెచ్ఈవీ' హైబ్రిడ్ ఎస్‌యూవీని భారత్‌లో అధికారికంగా ఆవిష్కరించింది. దిల్లీ ఎక్స్‌షోరూమ్ వద్ద ఈ కారు ప్రారంభ ధరను ₹47.99 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. జపాన్ నుంచి నేరుగా 'కంప్లీట్లీ బిల్ట్ యూనిట్' (సీబీయూ) రూపంలో భారత్‌కు దిగుమతి అవుతున్న ఈ ప్రీమియం మోడల్, మన దేశంలో హోండా లైనప్‌లోనే అత్యంత విలాసవంతమైన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీగా నిలవనుంది.
లాంచ్ ప్రాసెస్ పూర్తవడమే ఆలస్యం.. కంపెనీ ఇప్పటికే కస్టమర్లకు డెలివరీలను కూడా ప్రారంభించింది. అంతేకాదు భారత్ కోసం కేటాయించిన మొదటి రెండు బ్యాచ్‌ల కార్లు అప్పుడే పూర్తిగా బుక్ అయిపోయాయని, 3వ బ్యాచ్ కోసం ఆర్డర్లు ఇచ్చామని హోండా ప్రతినిధులు తెలిపారు.
హోండా జెడ్ఆర్-వీ మోడల్‌లో 2.0-లీటర్ ఆట్కిన్సన్-సైకిల్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది డ్యూయల్ మోటార్ హైబ్రిడ్ సిస్టమ్, ఈ-సీవీటీ ట్రాన్స్‌మిషన్‌తో కలిసి పనిచేస్తుంది. ఈ స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ మొత్తం 184 పిఎస్ పవర్, 315 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. భారీ సైజ్ ఎస్‌యూవీ అయినప్పటికీ, ఇది లీటరుకు ఏకంగా 22.8 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుండటం విశేషం. అంతేకాకుండా, కేవలం 7.9 సెకెన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని హోండా స్పష్టం చేసింది.
డిజైన్ విషయానికి వస్తే, బయటవైపు పూర్తి ఎల్‌ఈడీ లైటింగ్, స్పోర్టీ లుక్ ఇచ్చే 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో రోడ్డుపై కళ్లు చెదిరే ప్రెజెన్స్‌ను అందిస్తుంది. కారు లోపల ఆల్-బ్లాక్ కేబిన్, ప్రీమియం లెథర్ సీట్లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్-అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. డ్రైవర్ సీటును 8-వేలు పవర్-అడ్జస్ట్ చేసుకోవచ్చని, అలాగే మెమరీ ఫంక్షన్ కూడా ఉందని కంపెనీ తెలిపింది. ఇక ఫ్రంట్ ప్యాసింజర్ సీటును 4-వే పవర్ అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు.
ఈ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీలో అత్యాధునిక సాంకేతిక ఫీచర్లను హోండా నింపేసింది.
వైర్‌లెస్ యపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేసే 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.2-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12-స్పీకర్ బాస్ ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, లగేజ్ కోసం విశాలమైన స్పేస్, 60:40 స్ప్లిట్-ఫోల్డింగ్ వెనుక సీట్లు, (సీట్లు మడిచితే ఏకంగా 1,313 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది). హ్యాండ్స్-ఫ్రీ పవర్డ్ టైల్‌గేట్, రీజెనరేటివ్ బ్రేకింగ్ ప్యాడిల్ షిఫ్టర్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఐడిల్ స్టాప్ సిస్టమ్, ఆటో రివర్స్-టిల్ట్ సైడ్ మిర్రర్లు వంటి మరెన్నో ఆధునిక హంగులు ఉన్నాయి.
E-Paper

