అడ్డగోలు వసూళ్లకు చెక్! ఆసుపత్రుల్లో బోర్డులపై ఇక చికిత్స ధరలు తప్పనిసరి.. కేంద్రం కీలక ఆదేశాలు!

దేశంలోని ఆసుపత్రులు, క్లినిక్‌లలో అన్ని రకాల వైద్య సేవల ధరల పట్టికను ఇంగ్లీష్‌తో పాటు స్థానిక భాషలో తప్పనిసరిగా ప్రదర్శించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. రోగుల నుంచి అధిక ఛార్జీల వసూలు, బిల్లుల వివాదాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

Published on: Oct 13, 2026 12:20 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ఆసుపత్రులకు వెళ్లే రోగులకు వైద్య పరీక్షలు, చికిత్సల ధరల విషయంలో పారదర్శకత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక అడుగు వేసింది. దేశంలోని అన్ని ఆసుపత్రులు, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్లు తమ వద్ద లభించే వైద్య సేవలు, సదుపాయాల రుసుముల (రేట్ల) పట్టికను స్పష్టంగా కనిపించేలా బోర్డులు ప్రదర్శించాలని ఆదేశించింది. ఈ బోర్డులను ఇంగ్లీష్‌తో పాటు ఆయా రాష్ట్రాల స్థానిక భాషల్లో (తెలుగు రాష్ట్రాల్లో తెలుగులో) తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.
expand-iconView Photos in a new improved layout
Published on Oct 13, 2026 12:20 PM

2/5

‘క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్, 2010’. 'క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (సెంట్రల్ గవర్నమెంట్) రూల్స్, 2012' ప్రకారం ప్రతి హాస్పిటల్ తమ రేట్ల పట్టికను రోగులు, వారి బంధువులకు సులభంగా కనిపించేలా ప్రముఖ ప్రదేశాల్లో ఇక బోర్డులపై ఉంచడం చట్టరీత్యా తప్పనిసరి. ఈ మేరకు ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేసేలా చూడాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు (చీఫ్ సెక్రటరీలకు) ప్రత్యేక లేఖ రాశారు. ఆసుపత్రులు బోర్డులపై సేవల ధరలను ప్రదర్శిస్తున్నాయో లేదో నిరంతరం సమీక్షించాలని, నిబంధనలు పాటించని వైద్య సంస్థలపై తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

3/5

అనేక సందర్భాల్లో చికిత్స పూర్తయ్యాక ఆసుపత్రులు ఊహించని రీతిలో భారీ బిల్లులు వేస్తున్నాయని, ధరలపై ముందుగా స్పష్టత లేకపోవడం వల్ల రోగుల బంధువులకు, ఆసుపత్రి యాజమాన్యాలకు మధ్య తీవ్ర వివాదాలు తలెత్తుతున్నాయని కేంద్రం గుర్తించింది. రేట్ల పట్టికలను స్థానిక భాషల్లో అందుబాటులో ఉంచడం వల్ల సామాన్య ప్రజలు కూడా ఏ చికిత్సకు ఎంత ఖర్చవుతుందో ముందుగానే తెలుసుకునే వెసులుబాటు కలుగుతుంది.

4/5

మరోవైపు, భారత్‌కు మెడికల్, ఆయుష్ వీసాలపై వచ్చే విదేశీ రోగులకు చికిత్స ప్యాకేజీల వివరాలను కూడా పారదర్శకంగా ప్రదర్శించాలని కేంద్రం లేఖలో పేర్కొంది. దీనివల్ల అంతర్జాతీయ రోగుల వద్ద అధిక రుసుములు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు తగ్గుతాయని, మెడికల్ టూరిజం రంగానికి మరింత గుర్తింపు లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

5/5

రాజ్యాంగం ప్రకారం ఆరోగ్యం అనేది రాష్ట్ర జాబితాలోని అంశం కావడం వల్ల, ఈ నిబంధనల అమలు బాధ్యత పూర్తిగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల యంత్రాంగాలపైనే ఉంటుంది. ఏపీ, తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టాల ప్రకారం ఆసుపత్రులు ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం కోరింది.

Related Photos