PF balance check : ఇక పీఎఫ్​ బ్యాలెన్స్​ చెక్​ చేసుకోవడం చాలా ఈజీ! వాట్సాప్​లో ఇలా..

ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ అదిరిపోయే శుభవార్త అందించింది. ఇకపై పోర్టల్ లాగిన్ తిప్పలు లేకుండా కేవలం వాట్సాప్ ద్వారానే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడంతో పాటు పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ కొత్త సేవను ఎలా ఉపయోగించాలో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

Published on: Nov 18, 2026 11:30 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్​ఓ) సభ్యులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఇకపై పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలన్నా, పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవాలన్నా ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. నేరుగా వాట్సాప్ వేదికగానే తమ ఖాతా వివరాలను సులభంగా పొందే సదుపాయాన్ని ఈపీఎఫ్ఓ అందుబాటులోకి తెచ్చింది. ఈ చాట్‌బాట్ సేవ ద్వారా ఖాతా నిల్వతో పాటు ఇటీవలి లావాదేవీలను క్షణాల్లో చూసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ 74వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా 2026 నవంబర్ 1న కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ సేవలను ప్రారంభించారు. అయితే ఈ సదుపాయాన్ని పొందాలంటే సభ్యులు తప్పనిసరిగా ఈపీఎఫ్ఓ అధికారిక వాట్సాప్ నంబర్‌ను మాత్రమే సంప్రదించాలి. అలాగే వారి మొబైల్ నంబర్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)తో అనుసంధానమై ఉండాలి.

Published on Nov 18, 2026 11:30 AM

2/6

వాట్సాప్‌లో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలా? - ముందుగా మీ ఫోన్ కాంటాక్ట్ జాబితాలో +91 87964 41800 నంబర్‌ను సేవ్ చేసుకోండి. లేదంటే ఈపీఎఫ్ఓ అధికారిక ప్రకటనలో ఇచ్చిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి నేరుగా చాట్ ప్రారంభించవచ్చు. వాట్సాప్ తెరిచి, సేవ్ చేసిన నంబర్‌కు 'Hi' అని మెసేజ్ పంపండి. చాట్‌బాట్ మీకు స్వాగత సందేశం పంపి, మీకు నచ్చిన భాషను ఎంచుకోమని అడుగుతుంది.

3/6

స్క్రీన్​పై కనిపించే మెనూలో 'PF Balance' (పీఎఫ్ బ్యాలెన్స్) ఆప్షన్‌ను ఎంచుకోండి. మీ గుర్తింపును నిర్ధారించుకోవడానికి సూచనలను పాటించండి. మీ యూఏఎన్​తో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది; దాన్ని ఎంటర్ చేయండి.

4/6

ధృవీకరణ పూర్తయిన తర్వాత, మీ యూఏఎన్‌కు ఒకటి కంటే ఎక్కువ పీఎఫ్ ఖాతాలు (Member IDs) అనుసంధానమై ఉంటే, మీకు కావాల్సిన ఖాతాను ఎంచుకోండి. మీరు ఎంచుకున్న ఖాతాలోని నిల్వ వివరాలను చాట్‌బాట్ వెంటనే చూపిస్తుంది. అక్కడి నుంచే పాస్‌బుక్ పొందే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు లేదా ప్రధాన మెనూకు తిరిగి వెళ్లవచ్చు.

5/6

ఖాతాలో జమ అయిన వాటాలు, లావాదేవీల పూర్తి రికార్డును అందించే ఈపీఎఫ్ పాస్‌బుక్‌ను కూడా ఇదే వాట్సాప్ సేవ ద్వారా పొందవచ్చు. ఇందుకోసం సభ్యులు ఈపీఎఫ్ఓ వాట్సాప్ చాట్ తెరిచి 'Hi' అని పంపిన తర్వాత, మెనూలో 'Passbook Download' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఓటీపీ ధృవీకరణ పూర్తి చేసి, సంబంధిత పీఎఫ్ ఖాతాను ఎంచుకుంటే చాట్‌బాట్ వెంటనే పాస్‌బుక్‌ను అందిస్తుంది. ఉద్యోగి వాటాతో పాటు యాజమాన్యం చెల్లించే వాటా సక్రమంగా ఖాతాలో జమ అవుతుందో లేదో తనిఖీ చేసుకోవడానికి, గతంలో తీసుకున్న విత్​డ్రాలు పరిశీలించడానికి ఈ పాస్‌బుక్ ఎంతో ఉపయోగపడుతుంది.

6/6

ఈ సేవలను ఉపయోగించేటప్పుడు ఉద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించాలి! కేవలం ఈపీఎఫ్ఓ అధికారిక వాట్సాప్ నంబర్ (+91 87964 41800)తో మాత్రమే సంభాషణ ప్రారంభించాలి. సంస్థ ప్రతినిధులమని చెప్పుకుంటూ ఎవరైనా ఫోన్ చేసినా, మెసేజ్ పంపినా మీ యూఏఎన్ పాస్‌వర్డ్, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్ వంటి సున్నితమైన సమాచారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ పంచుకోవద్దు. అధికారిక ధృవీకరణ ప్రక్రియలో భాగంగా మాత్రమే ఓటీపీలను ఎంటర్ చేయాలి. చివరగా, పీఎఫ్ ఖాతా సమాచారాన్ని సులభంగా తెలుసుకోవడానికి మాత్రమే ఈ వాట్సాప్ సదుపాయం ఉపయోగపడుతుంది; దీని ద్వారా పీఎఫ్ డబ్బు ఉపసంహరణ క్లెయిమ్స్దాఖలు చేయడం గానీ, బ్యాలెన్స్ బదిలీ చేయడం గానీ సాధ్యం కాదని ఉద్యోగులు గమనించాలి.

Related Photos