...
...
Next Story

'ఒక్కొక్కరికీ కచ్చితంగా సినిమా చూపిస్తాం' - పల్నాడు పర్యటనలో వైఎస్ జగన్ వార్నింగ్

వైసీపీ అధినేత జగన్ బుధవారం సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో పర్యటించారు. ఆత్మహత్య చేసుకున్న పార్టీ నేత నాగమల్లేశ్వరావ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ కుటుంబాన్ని పరామర్శించారు. జగన్ పర్యటన సందర్భంగా నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

Published on: Jun 18, 2025 10:17 PM IST
By , , Guntur, Andhrapradesh
Prefer HTon Google
Advertisement
<p>జగన్ రాకతో సత్తెనపల్లి పల్నాడు జిల్లా రెంటపాళ్ల కిక్కిరిసిపోయింది.ఆత్మహత్య చేసుకున్న ఉప సర్పంచ్ నాగ మల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత కుటుంబాన్ని పరామర్శించారు. </p>

జగన్ రాకతో సత్తెనపల్లి పల్నాడు జిల్లా రెంటపాళ్ల కిక్కిరిసిపోయింది.ఆత్మహత్య చేసుకున్న ఉప సర్పంచ్ నాగ మల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత కుటుంబాన్ని పరామర్శించారు.

వైసీపీ అధినేత జగన్ బుధవారం సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో పర్యటించారు.జగన్ పర్యటన సందర్భంగా నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

జగన్ కు అభివాదం చెబుతున్న పార్టీ కార్యకర్తలు

నాగమల్లేశ్వర రావు కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత.. జగన్ మీడియాతో మాట్లాడారు.

“టీడీపీకి అనుకూలంగా ఫలితాలు రావడం మొదలయ్యాక తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు నాగమల్లేశ్వర రావు ఇంటిపై రాళ్లు విసిరి, అతడిని అరెస్ట్ చేయించారు. ఊళ్లోంచి వెళ్లిపోవాలని, లేకపోతే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని, కాల్చి చంపుతామని సీఐ రాజేష్ బెదిరించాడు. వాళ్ల బెదిరింపులు, అవమానాల గురించి తండ్రికి చెప్పి నాగమల్లేశ్వర రావు ఆత్మహత్య చేసుకున్నాడు. కుల ప్రస్తావన తెచ్చి, అవమానించి, తిట్టి కొట్టి ఒక మనిషి చావుకు కారణమయ్యారు. వీరి ఇంటిపై దాడి చేసిన వారిలో ఎందరిని అరెస్ట్ చేశారు, ఎందరికి శిక్ష వేశారు అని అడుగుతున్నా? వేధించిన సీఐ మీద ఏం చర్యలు తీసుకున్నారు” అని ప్రశ్నించారు.

జగన్ రాకతో వైసీపీ కార్యకర్తలతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. అభివాదం చేసుకుంటూ జగన్ ముందుకు సాగారు.

“చంద్రబాబుకు వత్తాసుపలుకుతున్న కొందరు పోలీసులకు చెబుతున్నా..ఎల్లకాలం చంద్రబాబు అధికారంలో ఉండడు. మరో నాలుగేళ్లలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కరికీ సినిమా చూపిస్తానని ఖచ్చితంగా చెబుతున్నా" అని జగన్ వార్నింగ్ ఇచ్చారు.

"గ్రామంలో కనిపిస్తున్న అన్యాయాల్లో పోలీసులు భాగస్వాములైతే చంద్రబాబుతో పాటు వారినీ బోనెక్కిస్తామని హెచ్చరిస్తున్నాను” అని జగన్ కామెంట్స్ చేశారు.

“రెడ్ బుక్ రాజ్యాంగంలో బాధితులు ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవడం లేదు. ఇదే సత్తెనపల్లిలో గుత్తా లక్ష్మీనారాయణ ఆసుపత్రిలో ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. కమ్మవాడివి వైయస్ఆర్ సీపీలో ఎందుకు ఉన్నావు అంటూ డీఎస్పీ హనుమంతరావు అవమానించాడు. డీఎస్పీ హనుమంతరావు ఒక కుల ఉన్మాది. తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపుతానని లక్ష్మీనారాయణను బెదిరించాడు. దీంతో లక్ష్మీనారాయణ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. చంద్రబాబును ఒకటే అడుగుతున్నా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కమ్మవారు ఉండొద్దా?” అని జగన్ ప్రశ్నించారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe