Tirumala : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - సర్వదర్శనానికి 24 గంటలు

Tirumala Summer Rush Updates : వేసవి సెలవుల రద్దీ నేపథ్యంలో తిరుమలలో భారీగా భక్తుల రద్దీ నెలకొంది. మే 21న రికార్డు స్థాయిలో 79,603 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా… హుండీ ఆదాయం రూ.4.35 కోట్లుగా నమోదైంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.

Published on: May 22, 2026 11:54 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/7

వేసవి కాలం సెలవులు కావడంతో కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రానికి భక్తుల రాక పోటెత్తింది. శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి తరలివస్తున్న యాత్రికుల సంఖ్య రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తిరుమలలో ఊహించని విధంగా భక్తుల రద్దీ నెలకొంది.
expand-iconView Photos in a new improved layout
Published on May 22, 2026 11:54 AM

2/7

కొండపైకి వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) యంత్రాంగం అత్యంత ప్రతిష్టాత్మకంగా విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లను రాత్రింబవళ్లు పర్యవేక్షిస్తున్నారు.

3/7

వేసవి సెలవుల (సమ్మర్ హాలిడేస్) నేపథ్యంలో కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ ఊహించని స్థాయిలో పెరిగింది. తిరుమలకు పోటెత్తుతున్న సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అత్యంత సౌకర్యవంతంగా స్వామివారి దర్శనం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సరికొత్త వ్యూహాలతో సమర్థవంతమైన ఏర్పాట్లు చేస్తోందని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి వెల్లడించారు.

4/7

ఆధునిక సాంకేతికత, క్యూలైన్ల నిర్వహణ గురించి కీలక వివరాలను పంచుకున్నారు. తిరుమలలో తొలిసారిగా ప్రవేశపెట్టిన 'ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్' (Artificial Intelligence Command Control Centre) ద్వారా భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేస్తున్నామని ఆయన చెప్పారు. దీని సహాయంతో ప్రాపర్ టైమ్ మేనేజ్‌మెంట్, క్యూలైన్ల క్రమబద్ధీకరణ, నిరంతర పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారించడం వల్లే దర్శనాల సంఖ్యలో గణనీయమైన వృద్ధి సాధ్యమైందని స్పష్టం చేశారు.

5/7

గురువారం (మే 21న) ఒక్కరోజే మొత్తం 79,603 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.స్వామివారికి మొక్కులు చెల్లించుకుని తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 45,125 గా నమోదైంది.

6/7

నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ద్వారా రూ.4.35 కోట్ల ఆదాయం కానుకల రూపంలో వచ్చింది.

తిరుమలలోని వైకుంఠం కాంప్లెక్స్ కంపార్ట్‌మెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. వెలుపల ఉన్న క్యూలైన్ శ్రీవారి సేవాసదన్ వరకు పొడవుగా విస్తరించింది.

ఎలాంటి టైమ్ స్లాట్ టోకెన్లు (SSD) లేని సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి దాదాపు 18 నుండి 24 గంటల సమయం పడుతోంది.

7/7

వేసవి కాలపు భారీ రద్దీని తట్టుకునేలా టీటీడీలోని అన్ని ప్రధాన విభాగాలతో పాటు విజిలెన్స్,  పోలీస్ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తున్నాయని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండే భక్తులకు ఎండ తీవ్రత తెలియకుండా నిరంతరాయంగా తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు, వైద్య సేవలు అందిస్తున్నట్లు ప్రకటించారు.

Related Photos