AP Telangana Weather : ఓవైపు ఎండలు... మరోవైపు వర్ష సూచన - తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం..!

AP Telangana Weather Forecast : తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. ఓవైపు ఎండలు దంచికొడుతుండగా… మరోవైపు వర్షాలు పడుతున్నాయి. మరో రెండు మూడు రోజులు వర్షాలు పడే సూచనలున్నాయి.

Published on: Apr 29, 2026 9:03 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది కొమరిన్ ప్రాంతం నుంచి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా సగటు సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది.
expand-iconView Photos in a new improved layout
Published on Apr 29, 2026 9:03 AM

2/6

ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఓవైపు ఎండలు ఉన్నప్పటికీ…. మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని చాలా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

3/6

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఇవాళ ఏపీలోని మన్యం, అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

4/6

బుధవారం (29-04-26) అధిక ఉష్ణోగ్రతలతో పాటు విజయనగరం, పార్వతీపురమన్యం జిల్లాల్లోని 21 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 7 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. వడగాలులు, ఎండ తీవ్రత, ఉక్కపోత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
(image source @APSDMA)expand-iconView Photos in a new improved layout
Published on Apr 29, 2026 9:03 AM

బుధవారం (29-04-26) అధిక ఉష్ణోగ్రతలతో పాటు విజయనగరం, పార్వతీపురమన్యం జిల్లాల్లోని 21 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 7 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. వడగాలులు, ఎండ తీవ్రత, ఉక్కపోత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

(image source @APSDMA)

5/6

ఇక తెలంగాణలో చూస్తే మరో మూడు నాలుగు రోజులు వర్షాలు పడే సూచనలున్నాయి. ఇవాళ సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
expand-iconView Photos in a new improved layout
Published on Apr 29, 2026 9:03 AM

ఇక తెలంగాణలో చూస్తే మరో మూడు నాలుగు రోజులు వర్షాలు పడే సూచనలున్నాయి. ఇవాళ సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

6/6

మే 1,2 తేదీల్లోనూ తెలంగాణలో వర్షాలు పడే సూచనలున్నాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఎండలు కూడా దంచికొడుతున్నాయి.
(image istock)expand-iconView Photos in a new improved layout
Published on Apr 29, 2026 9:03 AM

మే 1,2 తేదీల్లోనూ తెలంగాణలో వర్షాలు పడే సూచనలున్నాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఎండలు కూడా దంచికొడుతున్నాయి.

(image istock)

Related Photos