IMD Weather Report : ఏపీ, తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం - ఇవాళ ఈ జిల్లాలకు వర్ష సూచన..!

Published on Apr 08, 2026 07:13 am IST

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ మరోసారి రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ కూడా పలు జిల్లాల్లో వర్షాలు పడే సూచనలున్నాయి. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.

1 / 6

తెలంగాణ, రాయలసీమ మరియు తమిళనాడు ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణశాఖ పేర్కొంది. దీని మీదుగా మన్నార్ వరకు ద్రోణిగా విస్తరించి ఉందని తెలిపింది.
(image source @APSDMA) expand-icon View Photos in a new improved layout
Published on Apr 08, 2026 07:13 am IST

తెలంగాణ, రాయలసీమ మరియు తమిళనాడు ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణశాఖ పేర్కొంది. దీని మీదుగా మన్నార్ వరకు ద్రోణిగా విస్తరించి ఉందని తెలిపింది.

(image source @APSDMA)

2 / 6

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఇవాళ(ఏప్రిల్ 8) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం,అల్లూరి,పోలవరం,విశాఖ,అనకాపల్లి,కాకినాడ, కోనసీమ,తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి,ఏలూరు,కృష్ణా,ఎన్టీఆర్,గుంటూరు జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

expand-icon View Photos in a new improved layout
Published on Apr 08, 2026 07:13 am IST

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఇవాళ(ఏప్రిల్ 8) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం,అల్లూరి,పోలవరం,విశాఖ,అనకాపల్లి,కాకినాడ, కోనసీమ,తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి,ఏలూరు,కృష్ణా,ఎన్టీఆర్,గుంటూరు జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

3 / 6

బాపట్ల,పల్నాడు,మర్కాపురం,ప్రకాశం,నెల్లూరు,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయి.
expand-icon View Photos in a new improved layout
Published on Apr 08, 2026 07:13 am IST

బాపట్ల,పల్నాడు,మర్కాపురం,ప్రకాశం,నెల్లూరు,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయి.

4 / 6

మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికి శ్రీకాకుళం జిల్లాలోని కోర్లాంలో 59.5 మిమీ, అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేటలో 55.2మిమీ, రాజంలో 47మిమీ, కె.కోటపాడులో 21.2మిమీ, చొప్పున అధిక వర్షపాతం నమోదైందనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటన ద్వారా పేర్కొంది.
expand-icon View Photos in a new improved layout
Published on Apr 08, 2026 07:13 am IST

మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికి శ్రీకాకుళం జిల్లాలోని కోర్లాంలో 59.5 మిమీ, అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేటలో 55.2మిమీ, రాజంలో 47మిమీ, కె.కోటపాడులో 21.2మిమీ, చొప్పున అధిక వర్షపాతం నమోదైందనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటన ద్వారా పేర్కొంది.

5 / 6

ఇక తెలంగాణలో కూడా ఇవాళ పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

expand-icon View Photos in a new improved layout
Published on Apr 08, 2026 07:13 am IST

ఇక తెలంగాణలో కూడా ఇవాళ పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

6 / 6

ఏప్రిల్ 9వ తేదీన పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

expand-icon View Photos in a new improved layout
Published on Apr 08, 2026 07:13 am IST

ఏప్రిల్ 9వ తేదీన పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

• మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!