ఏపీకి ఐఎండీ అలర్ట్ - ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు..! హెచ్చరికలు జారీ

By , Andhrapradesh
Published on Dec 04, 2025 06:53 am IST

ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇవాళ కూడా పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. ఆయా జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి.

1 / 6

నైరుతి బంగాళాఖాతంలోని వాయుగుండం.. తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. ఇది పశ్చిమ దిశగా నెమ్మదిగా కదులుతూ గురువారంలోగా అల్పపీడనంగా బలహీనపడుతుందని వాతారవణశాఖ అంచనా వేస్తోంది.
expand-icon View Photos in a new improved layout
Published on Dec 04, 2025 06:53 am IST

నైరుతి బంగాళాఖాతంలోని వాయుగుండం.. తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. ఇది పశ్చిమ దిశగా నెమ్మదిగా కదులుతూ గురువారంలోగా అల్పపీడనంగా బలహీనపడుతుందని వాతారవణశాఖ అంచనా వేస్తోంది.

2 / 6

ఇవాళ(డిసెంబర్ 4, 2025) నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
expand-icon View Photos in a new improved layout
Published on Dec 04, 2025 06:53 am IST

ఇవాళ(డిసెంబర్ 4, 2025) నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

3 / 6

ఇక ఏపీలోని ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
expand-icon View Photos in a new improved layout
Published on Dec 04, 2025 06:53 am IST

ఇక ఏపీలోని ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

4 / 6

బుధవారం సాయంత్రం 5 గంటల నాటికి తిరుపతి (జిల్లా) తొట్టంబేడులో 47.2 మిమీ, నెల్లూరు(జిల్లా) కృష్ణపట్నంలో 37.5 మిమీ, తిరుపతి(జిల్లా) మన్నారుపోలూరులో 32.7మిమీ, చిత్తూరు(జిల్లా) నిండ్రలో 30 మిమీ వర్షపాతం నమోదైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
expand-icon View Photos in a new improved layout
Published on Dec 04, 2025 06:53 am IST

బుధవారం సాయంత్రం 5 గంటల నాటికి తిరుపతి (జిల్లా) తొట్టంబేడులో 47.2 మిమీ, నెల్లూరు(జిల్లా) కృష్ణపట్నంలో 37.5 మిమీ, తిరుపతి(జిల్లా) మన్నారుపోలూరులో 32.7మిమీ, చిత్తూరు(జిల్లా) నిండ్రలో 30 మిమీ వర్షపాతం నమోదైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

5 / 6

మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అనూహ్యంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా తిరుపతి జిల్లా వాకాడులో 28.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
expand-icon View Photos in a new improved layout
Published on Dec 04, 2025 06:53 am IST

మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అనూహ్యంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా తిరుపతి జిల్లా వాకాడులో 28.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

6 / 6

తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు, రైతులంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒక్కసారిగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని… లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు.
expand-icon View Photos in a new improved layout
Published on Dec 04, 2025 06:53 am IST

తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు, రైతులంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒక్కసారిగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని… లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు.

• మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!